»Chikkadpally And Narayanguda Metro Stations Closed 4 30 Pm To 6 30 Pm
Hyd Metro stations: హైదరాబాద్‌లో 2 మెట్రో స్టేషన్లు మూసివేత..కారణమిదే
హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా రెండు మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసీవేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
chikkadpally and narayanguda stations closed 4.30 pm to 6.30 pm
హైదరాబాద్ మెట్రో(hyderabad metro) రైల్ అధికారులు ప్రయాణికులకు కీలక ప్రకటన చేశారు. చిక్కడపల్లి(chikkadpally), నారాయణగూడ(narayanguda) మెట్రో స్టేషన్లు సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు తాత్కాలికంగా రద్దు చేసిన విషయాన్ని తెలుసుకుని ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు. దానికి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ(modi) సోమవారం హైదరాబాద్‌లో జరగనున్న రోడ్‌షో(road show) పాల్గొననున్నారు. ఈ క్రమంలో భద్రతా వివరాలలో భాగంగా గ్రీన్ మెట్రో లైన్‌లోని చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు ప్రధాని రోడ్‌షోకు 15 నిమిషాల ముందు, ఆ తరువాత మూసివేయబడతాయి. అదనంగా గ్రీన్ మెట్రో లైన్‌లోని RTC X రోడ్స్ మెట్రో స్టేషన్ ఆర్మ్-బి కూడా ఈ కాలంలో తాత్కాలికంగా మూసివేయబడుతుందన్నారు. అయితే షెడ్యూల్ విరామం తర్వాత ప్రయాణికులకు మెట్రో సేవలు యాథావిధిగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.