»Modi Said Bjp First Cm From Bc Category In The Telangana At Karimnagar
Modi: రాష్ట్రంలో బీసీ వర్గం నుంచే బీజేపీ తొలి సీఎం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్లో ప్రధాని మోడీ ప్రర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని వెల్లడించారు. దీంతోపాటు మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
modi said BJP first CM from BC category in the telangana at karimnagar
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ప్రధాని నరేంద్ర మోడీ(modi) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో పర్యటించిన మోడీ..రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ తెలంగాణ వచ్చి పదేళ్లు అయినా కూడా ప్రజల జీవన విధానం పెద్దగా మారలేదన్నారు. అవినీతి, కుటుంబ పాలన అనగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గుర్తుకువస్తున్నాయని మోడీ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధిని బీజీపీ కోరుకుంటుందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే బీఆర్ఎస్(BRS) పార్టీని గెలిపించినట్లే అవుతుందని మోడీ అన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కూడా మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు గుర్తు చేశారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అవమానించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీజేపీ ద్వారా మాత్రమే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో బీజీపీని గెలిపిస్తే బీసీ వర్గం నుంచే తొలి సీఎంను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవసరం లేదని మోడీ అన్నారు.
అంతకుముందు మహబూబాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ ఇప్పుడు కరీంనగర్(karimnagar)లో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఎస్సీ, ఎస్టీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహం చేశాయని ప్రధాని మోడీ అన్నారు. సామాజిక న్యాయానికి భరోసా ఇస్తుంది కేవలం బీజేపీ(BJP) మాత్రమేనని చెప్పారు. దేశంలోని గిరిజన విద్యార్థులకు సాధికారత కల్పించేందుకు ఉపకార వేతనాలను అందజేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెలంగాణ ప్రజలు సన్నద్ధమయ్యారని ఆరోపించారు.