»Revanth Reddy Said That Kcr Distributed 1000 Crores In Telangana
Revanth Reddy: మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో రూ.కోట్లు
మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కేసీఆర్ వేల కోట్లు దాచాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి వందసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ పార్టీ కేసీఆర్ కనుసైగలతో నడుస్తుందన్నారు.
Revanth Reddy said that KCR distributed 1000 crores in Telangana
Revanth Reddy: మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలను ఉంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఇంటి నుంచి రూ. 1,000 కోట్లు పంపిణీ జరిగిందని తెలిపారు. మరో రూ. 300 కోట్లు గోయల్ ఇంట్లోనే ఉన్నాయని వెల్లడించారు. దీని గురించి చెప్పెందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అన్నారు. వికాస్ రాజ్ తో మాట్లాడేందుకు ఇద్దరు ఎంపీలు ప్రయత్నించినా ఫలితం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏకే గోయల్ ఇంట్లో డబ్బులేదని అబద్దం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని, ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడన్నారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి అవి ఉద్యోగాలు అని కేసీఆర్ మురిసిపోతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇక తెలంగాణలోని బీజేపీ(BJP) పార్టీ కేసీఆర్ సూచనలతో నడుస్తుందని, ప్రధాని మోడీ(Modi), కేసీఆర్ ఈ పదేళ్లు ఆస్తులు పంచుకున్నారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారని వెల్లడించారు. ప్రజలను డబ్బుతో కొనాలని కేసీఆర్ చూస్తున్నాడు, ఓటుకు పది వేలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ఎన్నికల సర్వేలన్ని కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ గెలుపుతో ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.