Big B Amitabh Bachchan Gifts Juhu Bungalow To Daughter Sweta
Big B Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనకు ఇష్టమైన జుహు బంగ్లా ప్రతీక్షను కూతురు శ్వేతా బచ్చన్ నందాకు బహుమతిగా ఇచ్చారు. అమితాబ్‌కు (Amitabh)చాలా ఇళ్లు ఉన్నప్పటికీ.. జుహూ ఇళ్లు అంటే ఇష్టం ఎక్కువ. దీనికి సంబంధించి ఈ నెల 8వ తేదీన గిప్ట్ డీడ్ జరిగిందని.. స్టాంప్ డ్యూటీగా రూ.50.65 లక్షలు చెల్లించారని తెలుస్తోంది.
పేరంట్స్ తేజీ, హరివంశ్ రాయ్ బచ్చన్‌తో కలిసి అమితాబ్ (Amitabh) జుహులో (juhu) ఉండేవారు. ఇది కాక అందేరిలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ 21వ అంతస్తులో 4 ప్లాట్స్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఒక్కో ఫ్లాట్ రూ.7.18 కోట్లు ఉంటుందట. కొన్నాళ్ల క్రితం అట్లాంటిస్లో రూ.31 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉంటోన్న జల్సా ఇండిపెండెంట్ హౌస్ వందలాది కోట్ల విలువ చేస్తోంది.
ప్రభాష్ కల్కి 2898 మూవీ, రజనీకాంత్ తలైవర్ 170 మూవీలో అమితాబ్ నటిస్తున్నారు. హిందీ, ప్రాంతీయ భాష సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కౌన్ బనేగా క్రోక్ పతి 15 సీజన్‌కు హోస్ట్‌గా ఉన్నారు. అభిషేక్ బచ్చన్ కుమారుడు కాగా.. ఆయన కూడా బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నాడు. ఆశించినంత పేరు రాలేదు. కోడలు ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభి- ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య అనే కూతురు ఉంది.