Trisha: సారీ చెప్పిన మన్సూర్ అలీఖాన్.. క్షమించేసిన త్రిష!
ఇటీవల వచ్చిన లియో చిత్రంలో నటించిన సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్, త్రిషను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మన్సూర్ అలీఖాన్, త్రిషకు సారీ చెప్పగా.. త్రిష కూడా క్షమించేసింది.
ఓ ఇంటర్వ్యూలో అలీఖాన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా సినిమాల్లో రేప్ సీన్స్‌లో నటించా.. ‘లియో’ ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో కూడా ఇలాంటి సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని అనుకున్నా. కానీ అందులో అలాంటి సీన్ లేదు.. చాలా బాధ పడ్డాను..’ అని చెప్పాడు మన్సూర్ అలీఖాన్. దీంతో అతని వ్యాఖ్యలపై త్రిష చాలా సీరియస్‌గా స్పందించింది. ‘అలాంటి నీచమైన వ్యక్తితో తెరను పంచుకోనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటివాళ్లు మన జాతికే సిగ్గుచేటు’ అంటూ మండిపడింది. ఈ విషయంలో లోకేశ్ కనగరాజ్, మాళవికా మోహనన్.. తదితరులు త్రిషకు మద్దతు పలికారు.
టాలీవుడ్ నుంచి హీరో నితిన్, మెగాస్టార్ చిరంజీవి మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇంత జరిగినా మన్సూర్ అలీఖాన్ మాత్రం తగ్గేదేలే అన్నాడు. నడిగర్ సంఘం మన్సూర్ పై తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. త్రిషకు సారీ చెబితే ఈ నిషేధాన్ని తొలగిస్తామని తీర్మానించారు. కానీ మన్సూర్ మాత్రం చెన్నైలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. నేను ఏ తప్పూ మాట్లాడలేదని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదీ లేదని, నా విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని వార్నింగ్ ఇచ్చారు.
కానీ ఎట్టకేలకు మన్సూర్ ఆలీ ఖాన్, త్రిషకు క్షమాపణలు చెప్పారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి.. అందుకు క్షమాపణలు కోరుతున్నా.. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది.. అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీని పై త్రిష ఇండైరెక్ట్‌గా ఆయనను క్షమించినట్టుగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దైవత్వం’ అని ట్వీట్ చేసింది. మొత్తంగా ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టేనని చెప్పొచ్చు.