»Rs 525 Coin And Mirabai Postal Stamp Released By Modi
PM Modi: మోదీ చేతుల మీదుగా రూ.525 నాణేం, మీరాబాయి పోస్టల్ స్టాంప్ విడుదల
మీరాబాయి 525 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్స్, 525 రూపాయల నాణేలను విడుదల చేశారు. సెయింట్ మీరాబాయి మహిళా శక్తిని బలోపేతం చేశారని ఈ సందర్భంగా ప్రదాని మోదీ కొనియాడారు.
సెయింట్ మీరాబాయి 525వ జయంతి సందర్భంగా ఆమె పేరుపై పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని మోదీ విడుదల చేశారు. అలాగే 525 రూపాయల నాణేలను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..మథురను సందర్శించి మీరాబాయి పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. బృందావనం లేకుండా మీరాబాయి భక్తి పూర్తికాదన్నారు. మధుర, బ్రజ్ ప్రాంతాలను సందర్శించడం వల్ల ప్రతి ఒక్కరూ గొప్ప అనుభూతిని పొందుతారన్నారు.మీరాబాయి జయంతి ఒక సాధువు జయంతి మాత్రమే కాదని, అది భారతదేశ సంస్కృతికి సంబంధించిన వేడుక అని అన్నారు.
పోస్టల్ స్టాంప్, నాణేలను విడుదల చేస్తున్న ప్రధాని మోదీ:
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तर प्रदेश के मथुरा में संत मीरा बाई के सम्मान में एक स्मारक डाक टिकट और एक स्मारक सिक्का जारी किया। pic.twitter.com/Hd2pP6eUjX
మన దేశం ఎప్పుడూ మహిళా శక్తిని ఆరాధించే దేశం అని, సెయింట్ మీరాబాయి సమాజానికి అత్యంత అవసరమైన మార్గాన్ని చూపించారని తెలిపారు. క్లిష్ట సమయాల్లో మీరాబాయి మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచారన్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే శక్తి సాధువు మహిళలకు ఉందని మోదీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక బ్రజ్ ప్రాంతానికి సరైన ప్రాముఖ్యత దక్కలేదన్నారు. భారత దేశం నుంచి ఆధ్యాత్మిక గుర్తింపును ఎవ్వరూ విడదీయలేరన్నారు. స్వాతంత్య్రం వచ్చాక బానిస మనస్తత్వాన్ని వదులుకోలేని వారు బ్రజ్ భూమిని అభివృద్ధి జరగకుండా చేశారన్నారు.
మీరాబాయి (Mirabai) దేశానికి చేసిన సేవలకు గాను, ఆథ్యాత్మికతకు గాను ఆమె జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంప్స్ (Postal Stamps) విడుదల చేయడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆమెకు గౌరవార్థం 525వ జయంతి సందర్భంగా 525 రూపాయల నాణేలను (Rs.525 coins) మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లుగా మోదీ వెల్లడించించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.