CTR: ఎస్ఆర్ పురం మండలంలోని ఆరి మాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెదవాడ గ్రామపంచాయతీని ప్రభుత్వం టీబీ రహిత పంచాయతీగా అధికారికంగా గుర్తించింది. గ్రామంలో క్షయవ్యాధి నిర్మూలనకు చేపట్టిన సమగ్ర చర్యలు, వైద్య సిబ్బంది కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా మెదవాడ సర్పంచ్‌తో పాటు వైద్య సిబ్బంది అవార్డు అందుకుంటూ గౌరవం పొందారు.