BHPL: 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద BHPL జిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుంచి వివిధ ఆర్థిక సహాయ పథకాలకు దరఖాస్తు చివరి తేదీని 24.03.2026 నుంచి 02.04.2026 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు 671 దరఖాస్తులు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హత గల వారు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.