TPT: టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు దాతలు భారీగా విరాళాలు అందించారు. మొత్తం రూ.60 లక్షల విరాళం అందగా, చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు, హైదరాబాద్కు చెందిన వి. భవేశ్ చౌదరి రూ.10,07,777, తూర్పు గోదావరి జిల్లా చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు సమర్పించారు. తిరుమలలో అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు.