Leo: ‘లియో’ ట్విస్ట్.. ఓటిటి రిలీజ్‌కు రెండు డేట్స్!
ఫైనల్‌గా కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన 'లియో' సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు రెండు డేట్స్ లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ లియో ఏయో తేదీలలో ఓటిటిలోకి రానుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లియో సినిమా ఓటిటి రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా.. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన లియో సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా తమిళ్‌తో పాటు తెలుగులో భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది లియో. కానీ అనుకున్న రేంజ్ అంచనాలను అందుకోలేకపోయింది.
అయినా కూడా ఈ సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేశారో.. ఇప్పుడు ఓటిటిలోకి వస్తున్న నేపథ్యంలోనూ అంతే రచ్చ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయిన మూవీ లవర్స్ ఓటిటి డేట్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లియో మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. కానీ రెండు డేట్స్ అనౌన్స్ చేయడం అందరిలోనూ ఆసక్తిగా మారింది. ముందుగా పాన్ ఇండియా భాషల్లో ఓన్లీ ఇండియా వెర్షన్లో నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.
అయితే గ్లోబల్ వెర్షన్లో మాత్రం నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా రెండు డేట్స్ అనౌన్స్ చేశారు. అంటే.. నవంబర్ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో లియో స్ట్రీమింగ్ కానుండగా.. 28న వరల్డ్ వైడ్‌గా ఓటిటిలో అందుబాటులోకి రానుంది. దీంతో లియో ఓటిటి రాక కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. మరి ఓటిటిలో లియో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.