»All The Hyderabad Hotels And Restaurants Open At 5 Am To 12 Am Telangana Elections Effect 2023
Hyderabad: హోటళ్లు, రెస్టారెంట్లు అన్ని ఉదయం 5 గంటలకే ఓపెన్..కారణమిదే
హైదరాబాద్లో(Hyderabad) హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటలకే ఓపెన్ చేయనున్నారు. అంతేకాదు రాత్రి కూడా 12 గంటల వరకు తెరిచే ఉంచనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
All the hyderabad hotels and restaurants open at 5 am to 12 am telangana elections effect 2023
తెలంగాణలో ఎన్నికలు(Telangana assembly elections 2023) జరిగే వరకు హైదరాబాద్ నగర పోలీసులు నగరంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలకు(hotels and restaurants) కొత్త పని వేళలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని రోజులలో హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటలకు తెరిచి రాత్రి 12 గంటలకు మూసివేయాలని కోరారు. అయితే సాధారణ సమయంలో హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రకారం దుకాణాలు, వ్యాపార సంస్థలు ఉదయం 9 గంటలకు తెరిచి రాత్రి 11 గంటలకు మూసివేయబడతాయి.
దుకాణాలు, ఇతర స్థానిక వ్యాపారాలు ఇప్పుడు ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల మధ్య తెరవబడతాయి. మరోవైపు వారమంతా ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్లు కొనసాగుతాయి. దీంతోపాటు 2B లైసెన్స్ ఉన్న పబ్లు, డిస్కో బార్లు పని దినాలలో(timings) ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల మధ్య తెరిచి ఉంటాయి. వారాంతాల్లో ఇవి తెల్లవారుజామున 1 గంటలకు మూసివేయబడతాయి. ఇక ఎ4 లైసెన్స్ ఉన్న వైన్ షాపులు ఎన్నికలు ముగిసే వరకు స్థానిక దుకాణాలు, వ్యాపారాల మాదిరిగానే షెడ్యూల్ను అనుసరిస్తాయని పోలీసులు తెలిపారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.
తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో “మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) అమలులో ఉన్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.