»Fire Accident In Visakhapatnam Fishing Harbour 40 Boats Burned
Visakhapatnam: ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం..40 బోట్లు దగ్ధం
విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్క పడవకు మంటలు చెలరేగి చివరికీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి 40 బోట్లు కాలి బూడిదయ్యాయి.
Fire accident in Visakhapatnam fishing harbour 40 boats burned
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్(fishing harbour)లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోటులో ఆగస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 40కి పైగా పడవలు దగ్ధమైనట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎగసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్లతో అదుపులోకి తీసుకొచ్చారు. పడవల్లో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకున్నట్లు కూలీలు ప్రాథమికంగా అనుమానించారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడంతో బోటు యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే అసలు ఈ అగ్ని ప్రమాదం(fire accident) ఎలా జరిగింది? ఎవరైనా కావాలనే చేశారా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు ఒకేసారి 40 పడవలు ఎలా కాలిపోతాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎవరో కావాలనే చేశారని ఇంకొంత మంది అంటున్నారు. మరోవైపు ఈ ప్రమాదం ద్వారా మొత్తం ఎంత ఆస్తి నష్టం జరిగందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది.