Kamareddyలో కేసీఆర్ అమ్మమ్మ ఊరు ఉందా..? ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలే: రేవంత్ రెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అమ్మమ్మ ఊరు ఉందట.. మరి ఇన్నాళ్లు నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy:గల్ఫ్ కార్మికులను అదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కార్మికుల సంక్షేమ నిధి హామీ కూడా నెరవేర్చలేదని చెప్పారు. రైతుల భూములను మింగేందుకు కేసీఆర్ (kcr) కామారెడ్డి వచ్చారని విమర్శించారు. ఇక్కడ ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారని గుర్తుచేశారు. శనివారం బిక్కనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నియోజకవర్గంలో కేసీఆర్ (kcr) అమ్మమ్మ ఊరు ఉందని కొత్త పల్లవి అందుకుంటున్నారని.. మరి రైతులు చనిపోయిన సమయంలో ఎందుకు రాలేదని చెప్పారు. గజ్వేల్‌లో భూములు లేవని.. ఇప్పుడు కామారెడ్డి వచ్చారని గుర్తుచేశారు. సిద్దిపేటలో అల్లుడు హరీశ్ రావు (harish rao), సిరిసిల్లలో కుమారుడు కేటీఆర్ (ktr) ఊడ్చేశారని.. ఇప్పుడు కామారెడ్డిపై కేసీఆర్ కన్నుపడిందని చెప్పారు.
ముదిరాజ్ సామాజికి వర్గానికి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేసీఆర్ కేటాయించలేదని చెప్పారు. కానీ వారి ఓట్లు కావాలా అని అడిగారు. షబ్బీర్ అలీని నియోజకవర్గ ప్రజలు పెద్ద లీడర్‌ను చేశారని గుర్తుచేశారు. కామారెడ్డి బిడ్డల భూములను లాక్కొవడానికి వచ్చిన అనకొండ కేసీఆర్ అని విమర్శించారు. పల్లెలోకి వచ్చిన దానిని వేటాడేందుకు ఇక్కడకు వచ్చానని తెలిపారు.
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్‌ను సీఎం చేసేందుకు బయల్దేరారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధ్ బంద్ కాదని చెప్పారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల ఇస్తామని ప్రకటించారు.