ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ సెకండ్ ఎపిసోడ్ యానిమల్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసింది ఆహా. . యానిమల్ ట్రైలర్ డేట్ కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
Unstoppable promo is here.. 'Animal' trailer is coming!
Unstoppable Promo: అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం హిందీ స్టార్ హీరోతో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన యానిమల్ టీజర్, పోస్టర్లు అదిరిపోయాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్.
తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య అన్‌స్టాపబుల్ (Unstoppable) థర్డ్ సీజన్ సెకండ్ ఎపిసోడ్ షోలో సందడి చేసింది యానిమల్ టీమ్ (animal team). తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో (promo) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ తో మొదలైన ఈ ప్రోమో.. నెక్స్ట్ రష్మీక, రణబీర్ కపూర్ ఎంట్రీతో అదిరిపోయింది. బాలయ్య మార్క్ ఎంటర్టైన్మెంట్తో హిలేరియెస్గా ఉంది ప్రోమో. ప్లూటు జింక ముందు ఊదు.. అని రణ్‌బీర్ చెప్పిన డైలాగ్ కూడా ప్రోమో కట్లో చూడొచ్చు.
ఈ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్కి రానుంది. యానిమల్ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాన్ ఇండియన్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని నవంబర్ 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపో మాపో దీనిపై క్లారిటీ రానుంది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను.. సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. మరి యానిమల్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.