»Gautam Gambhir Said Shreyas Iyer Was A Game Changer In The World Cup Final
Gautam Gambhir: ఫైనల్ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ అతడే!
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కోసం అంత సిద్ధం అయింది. ఈ ఉత్కంఠ పోరులో భారత్ గెలవాలని ఎంతో పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్‌లో ఈ మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకం కానున్నాడని గౌతమ్ గంభీర్ జోస్యం చెప్పారు.
Gautam Gambhir said Shreyas Iyer was a game changer in the World Cup final
Gautam Gambhir: వన్డే వరల్డ్‌కప్(World Cup2023) ఫైనల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంంలో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gautam Gambhir) చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యార్(Shreyas Iyer) కీలకం కానున్నాడు అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై నిపుణులు అనేక విశ్లేషణలు వినిపిస్తున్నారు. దీనిపై గౌతమ్ గంభీర్ సైతం స్పందిస్తూ… ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతిమ పోరాటంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యంత కీలకంగా మారబోతున్నాడని అన్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్లు ఆడమ్ జంపా, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అయ్యర్ కీలకపాత్ర పోషించనున్నాడని అంచనా వేశాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉన్నా 70 బంతుల్లోనే సెంచరీ కొట్టాడని ప్రశంసించాడు. అందుకే ఫైనల్ మ్యాచ్‌లో అయ్యర్ గేమ్ ఛేంజర్(game changer) అవుతాడని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గంభీర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత అయ్యర్ జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చిందని, జట్టులోకి వచ్చాక అద్భుతంగా రాణిస్తున్నాడని, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా చక్కగా ఆడుతున్నాడని గౌతమ్ గంభీర్ కొనియాడాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. బుధవారం న్యూజిలాండ్‌పై సాధించిన అద్భుతమైన సెంచరీతో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు అయ్యర్ 75.14 సగటుతో 526 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 113 కంటే ఎక్కువే ఉంది. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో దూసుకుపోతున్నాడు. టోర్నీలో బెస్ట్ స్కోరు 128 నాటౌట్‌గా నిలిచాడు. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో అయ్యార్ ఉన్నాడు.