AP: శ్రీరామనవమి కానుకగా రామతీర్థంలో 3.7 కి.మీ గిరిప్రదక్షిణ మార్గాన్ని Dy CM పవన్ వర్చువల్గా ప్రారంభించారు. వైసీపీ హయాంలో అక్కడ జరిగిన ఘటనలు బాధాకరమని, నేడు అభివృద్ధి పనుల్లో పాల్గొనడం అదృష్టమని ఆయన పేర్కొన్నారు. మంత్రులు అనిత, ఆనం, కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఈ వేడుక జరిగింది. రూ.3.4 కోట్లతో నిర్మించిన ఈ మార్గం భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.