జబర్దస్త్ షో కమెడియన్ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఈ షోలో రీతూ చౌదరి లేడీ కమెడియన్ గా అడుగుపెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రీతూ తండ్రి గుండెపోటుతో కన్నుమూయడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నాన్నను తలచుకుంటూ రీతౌ చౌదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది. తన తండ్రితో ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘‘నాన్నా ఐ లవ్ యూ.. ఈ ఫొటోనే నేను నీతో తీసుకున్న చివరి ఫొటో. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ కూతురు దగ్గరికి తిరిగి రా’’ అంటూ రీతూ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆమె సహ నటీమణులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. రీతూ చౌదరి మొదటగా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ షోలో నటిస్తూ వస్తోంది.