Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీంట్లో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చూపుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నారు. లైకులు, వ్యూస్ కోసం తమ సొంత జీవితాలను కూడా పట్టించుకోవడం లేదు. ఫేమస్ కావాలని సిగ్గు శరం లేకుండా ఏం చేయడాకైనా సిద్ధపడుతున్నారు. రీల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెరైటీగా ఏదో ఒకటి చేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. అలాంటిదే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మీరు ఇప్పటి వరకు చాలా డ్యాన్స్ వీడియోలను చూసి ఉంటారు, కానీ ఒక వ్యక్తి తన శరీరానికి టవల్ చుట్టుకుని సిగ్నల్‌పై డ్యాన్స్ చేయడం మీరు చూశారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి టవల్లో తన శరీరాన్ని చుట్టి కూడలి మధ్యలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన శరీరానికి కేవలం టవల్ చుట్టుకొని కూడలిలో కనిపించడం చూడవచ్చు. ఇది చూసిన తర్వాత మీకు సినిమా డ్యాన్సర్ నోరా ఫతేహి ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఇక్కడ వ్యక్తి ఆమెను అనుకరించేందుకు ప్రయత్నించాడు. కిల్లర్ స్టైల్లో ఆమె డ్యాన్స్‌ని చూసి జనాలు నవ్వుకోలేకపోతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత పలువురు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.