AKP: కసింకోట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ కె. లక్ష్మి అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలు, సర్పంచులకు ఆహ్వానాలు పంపించడం జరిగిందన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలన్నారు.