»Kanna Lakshminarayana Tell Me At Least One Reason Why Jagan Should Be Cm
Kanna Lakshminarayana: జగన్ సీఎం ఎందుకు కావాలో ఒక్కటైనా చెప్పండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎందుకు కావాలో ఒక్కరైనా సరైనా కారణం చెప్పండి అంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఆయన కొత్తగా చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.
Kanna Lakshminarayana Tell me at least one reason why Jagan should be CM
Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్(YS Jagan) ఎందుకు కావాలో ఒక్క కారణం చెబితే చాలని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) ప్రశ్నించారు. గుంటూరులో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడిచిన నాలున్నర సంవత్సరాలలో ఏపీకి జరిగిన అభివృద్ధి గురించి ఏం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలతో ఒక పుస్తకమే ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టాడని, ఇప్పటి వరకు రాజధాని విషయంలో క్లారిటీ లేదని విమర్శించారు. అయినా మళ్లీ జగనే సీఎం కావాలని కొందరు అంటుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైఎస్ జగన్ మెహాన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 2019 నాటికే పోలవరం నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 75 శాతం పూర్తి చేశారని, మిగితా 25 శాతం పూర్తి చేయకుండా మొత్తం ప్రాజెక్ట్‌నే నాశనం చేశారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.