కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం యడ్యూరప్ప (Yeddyurappa) కుమారుడు, ఎమ్మెల్యే విజయేంద్ర యడ్యూరప్పను నియమించారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం ఆయన ఆ పదవికి ఎంపికయ్యారు. అతడి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా 50 నీళ్లు విజయేంద్ర (Vijayendra) గత ఎన్నికల్లో షికారీపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ బీజేపీ ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
అధ్యక్ష పదవిని సీటీ రవి(CT Ravi), సునీల్ కుమార్, బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆశించారు. వీరితో పోలిస్తే రేసులో విజయేంద్ర ముందున్నారు.ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో శిఖారిపుర (Shikharipura) అసెంబ్లీ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11,008 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. 2020లో విజయేంద్ర బీజేపీ కర్ణాటక (Karnataka) విభాగానికి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.. ప్రస్తుతం అధ్యక్షుడిని చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.