గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్.. శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. అయితే ఈ మధ్యలో గౌతమ్‌తో చరణ్ సినిమా ఉండే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. దాంతో రామ్ చరణ్ దర్శకుల లిస్ట్‌లో కొత్తగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకులు చరణ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఈ జాబితాలో గతేడాది వకీల్ సాబ్ సినిమాతో హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ కూడా చేరిపోయారు.
అది కూడా గతంలో అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన ఐకాన్ కథతో సినిమా చేయబోతున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు ఓ కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఫిల్మ్ ‘ఉగ్రం’సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నార్థన్.. 2017లో శివ రాజ్ కుమార్ హీరోగా కన్నడలో ‘మఫ్టీ’ అనే సినిమా తీసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఇటీవల కెజియఫ్ హీరో యష్‌తో భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ రిఫరెన్స్‌తో నార్థన్.. రామ్ చరణ్‌కు కథను వినిపించాడని.. చరణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల లిస్ట్ రోజు రోజుకి పెరుగుతునే ఉంది. మరి వీరిలో చరణ్ ఎవరితో సినిమాలు చేస్తాడో చూడాలి.