»Sejal Joined The Congress Party At Bellampalli Against Durgam Chinnaiah
Congress party:లో చేరిన శేజల్..పోటీ చేస్తుందా?
బెల్లంపల్లికి చెందిన శేజల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు చిన్నయ్య అనేక మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారని వ్యాఖ్యానించారు.
sejal joined the congress party at bellampalli against durgam chinnaiah
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోరాటం చేస్తున్న అరిజన్ సీఈఓ శేజల్(sejal) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈమె కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఆధ్వర్యంలో శేజల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి(bellampalli) చేరుకున్న వినోద్ ఆమెతోపాటు ఇతర నాయకులను కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో మాట్లాడిన శేజల్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాదు ఇదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరిజన్ డెయిరీ ఎండీ ఆదినారాయణపై పోలీసులతో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయించారని పేర్కొన్నారు. ఇది తెలుసుకుని బోర్డు మీటింగ్ లోనే ఈ కేసును రద్దు చేశామని గుర్తు చేశారు. ఇలా తమ సంస్థనే కాకుండా అనేక మంది అమాయకులపై దుర్గం చిన్నయ్య కేసులు పెట్టించడం అలవాటుగా మారిందని విమర్శించారు.
అయితే గతంలో కూడా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(durgam chinnaiah) తనపై వేధింపులకు పాల్పడ్డారని తనకు న్యాయం చేయాలని శేజల్ కోరింది. ఆ క్రమంలో పలు విధాలుగా నిరసనలు సైతం తెలిపింది. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి(suicide attempt) కూడా పాల్పడింది. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే, అతని సహచరులు తనను బెదిరిస్తున్నారని తెలిపింది. దానికి ముందు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని, న్యాయ సలహా, అభిప్రాయం తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.