»The Doctor Stopped The Operation In The Middle Because He Did Not Give Tea
Nagpur : ‘టీ’ ఇవ్వలేదని ఆపరేషన్ని మధ్యలోనే ఆపేసిన డాక్టర్
కప్పు టీ’ తీసుకురాలేదనే అసహనంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపి వేసిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
టీ ఇవ్వలేదని ఓ డాక్టర్ (Doctor) ఆపరేషన్‌ను మధ్యలో వదిలేసిన ఘటన నాగపూర్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వారికి సర్జరీ (Surgery) చేయటానికి డా.తేజ్‌రామ్ వెళ్లారు. ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లిన డాక్టర్ నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం అక్కడి సిబ్బంది ఆయనకు టీ ఇవ్వలేదని కోపంతో సర్జరీ చేయకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. బాధిత మహిళల కుటుంబ సభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందిత వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆస్పత్రికి మరో వైద్యుడిని పిలిపించినట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ నిర్లక్ష్యపూరిత ఘటనపై నాగ్‌పూర్ (Nagpur) జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ స్పందించారు. ఘటనపై విచారణ(investigation)కు కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.