»Big Accident For Amit Shah Electric Shock To Campaign Chariot
Amit Shahకు తప్పిన పెను ప్రమాదం.. ప్రచార రథానికి విద్యుత్ షాక్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని నాగౌర్లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార వాహనాన్ని తాకాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అమిత్ షా ప్రచార రథం రోడ్డుపై వెళ్తుండగా విద్యుత్ తీగను తాకింది. వెంటనే నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అమిత్ షాను వేరే కారులో తరలించారు. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని నాగౌర్ జిల్లాలో జరిగింది. అమిత్ షా ప్రచారానికి వెళ్తుండగా జరిగింది. ఫలితంగా ఎన్నికల ర్యాలీని రద్దు చేసుకున్నారు.. అమిత్ షా వాహనం వెనుకాల ఉన్న అన్ని వాహనాలను అప్రమత్తం చేశారు. వాహనాలను నిలిపివేసి కరెంటు సరఫరాను నిలిపేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
హోమంత్రి అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎన్నికల సభ(Electoral Assembly)లో పాల్గొనేందుకు బిడియాద్ గ్రామం నుంచి పర్బత్సర్ దిశగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా.. బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రమాదం(Accident)తప్పడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కాగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, దుకాణాలు ఉన్న వీధిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో కరెంటు వైర్లు వాహనానికి దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతోంది.