శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం మీదుగా చర్లపల్లి-సాలిమార్-చర్లపల్లి(17065/66)మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు సర్వీసులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లాలో శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుందని రైల్వేశాఖ తెలిపింది.