AP: ఇంటర్ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 1 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.