I Am Not That Person, Sara Ali Khan At Koffee With Karan Programme
Sara Ali Khan: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్- సారా టెండూల్కర్ గురించి ఒక్కటే రూమర్లు.. వారిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు కనిపించడంతో ప్రేమలో ఉన్నారనే చర్చ. దానికి తగ్గట్టు గిల్ ఆడే ప్రతీ మ్యాచ్ స్టాండ్స్‌లో సారా కనిపిస్తారు. ఇంకేముంది వారిద్దరూ లవ్ బర్డ్స్ అని అనుకుంటారు.
బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు. సీజన్ 8 షోకు సంబంధించి ప్రోమో వదిలారు. ఫస్ట్ ఎపిసోడ్ సారా అలీ ఖాన్ (Sara Ali Khan), అనన్య పాండేతో (ananya pandey) చేశారు. అందులో సారాను (sara) ప్రశ్నిస్తూ.. గిల్‌తో డేటింగ్లో ఉన్నావా అని అడుగుతారు. ఆ సారా తాను కాదని అలీఖాన్ (Ali Khan) చెబుతారు. సారా అనగానే తప్పుగా అనుకుంటున్నారు. దునియా మొత్తం తప్పుగా అర్థం చేసుకుంటుంది. గిల్ ప్రేమలో ఉన్నది తాను కాదని.. సచిన్ కూతురు సారా (sara) ఉందని ఇండైరెక్టుగా హింట్ ఇచ్చింది.
సారా- గిల్ ప్రేమలో ఉన్నారని పలు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ హాఫ్ సెంచరీ చేయగానే గ్యాలరీలో కూర్చొన్న సారా టెండూల్కర్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడే కాదు గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో కూడా సారా పాల్గొన్నారు. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అర్థం అవుతోంది. కాఫీ విత్ కరణ్ షోలో మరో హీరోయిన్ అనన్య పాండే పాల్గొన్నారు. ఆదిత్య రాయ్ కపూర్‌తో తాను ప్రేమలో ఉన్నానని హింట్ ఇచ్చారు. ఇలా ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.