Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Shubman Gill), సచిన్ కూతురు సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. దానికి తగ్గట్టు మ్యాచ్ ఉంటే చాలు.. గిల్ బ్యాటింగ్ చేసిన సమయంలో సారా వైపు ఆటోమెటిక్‌గా కెమెరా తిరుగుతుంది. దీంతో వీరి మధ్య ఏదో ఉందనే అంతా చర్చ జరుగుతోంది. వీరి లవ్ మ్యాటర్ కన్ఫామ్ కాలేదు.. అప్పుడే వీరి మధ్యలోకి మరొకరు వచ్చారు.
లండన్‌లో గిల్ ఉన్నాడు. అక్కడ ఆయనతో బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ కనిపించింది. వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగారు. లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టడంతో డేటింగ్ చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. పంజాబీ ఆల్బమ్ కోసం వీరిద్దరు వచ్చారని తెలుస్తోంది. గిల్, అవనీత్తోపాటు నిర్మాత రాఘవ శర్మ, అన్షుల్ గార్డ్ కూడా ఉన్నారు. ఆ ఫోటోలో వీరిద్దరూ కూడా కనిపించారు. అంతా ఒక్కటే చర్చ.. గిల్, అవనీత్ డేటింగ్ చేస్తున్నారని వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి వారిద్దరూ క్లారిటీ ఇవ్వాలి. లేదంటే సారా అయినా తమ మధ్య ఏమీ లేదనో.. ఉందనో ప్రకటించాలి.. అప్పటివరకు ఈ పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఏం జరుగుతుందో చుద్దాం.