ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై ఒక్కటే చర్చ.. ఈ క్రమంలో తన తప్పు ఏం లేదని మాథ్యూస్ అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశాడు.
Angelo Mathews: బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో లంక ప్లేయర్ ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ ఔటయ్యాడు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటే చర్చ.. టైమ్డ్ ఔట్ ఏంటీ..? ఎందుకు చేస్తారనే డిస్కషన్ జరుగుతోంది. నిన్నటి మ్యాచ్‌లో తాను ఔట్ కాదని.. ఎంపైర్ నిర్ణయం తప్పిదం అని మాథ్యూస్ (Angelo Mathews) అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో హెల్మెట్ ధరించిన తర్వాత 5 సెకన్ల సమయం ఉందని చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జరిగిన తప్పును సరిద్దిద్దగలరా అని అడిగారు. ఆటగాడికి భద్రత ముఖ్యం అని చెప్పడమే తన ఉద్దేశ్యం అంటున్నారు. హెల్మెట్ లేకుండా బౌలర్‌ను ఎదుర్కొలేను అంటూ చెప్పారు.
4th umpire is wrong here! Video evidence shows I still had 5 more seconds even after the helmet gave away! Can the 4th umpire rectify this please? I mean safety is paramount as I just couldn’t face the bowler without a helmet
సమర విక్రమ (samara vikrama) ఔటయ్యాక 2 నిమిషాల వ్యవధిలో మాథ్యూస్ (Mathews) క్రీజులోకి వచ్చినట్టుగా ఉంది. క్యాచ్ పట్టిన సమయం నుంచి హెల్మెట్ పట్టుకొని బయల్దేరిన సమయాన్ని రాశారు. అంఫైర్ అడ్రియన్ హోల్డ్ స్టాక్ వెర్షన్ మరోలా ఉంది. మాథ్యూస్ (Mathews) హెల్మెట్ సమస్య పరిష్కరించుకునే లోపు 2 నిమిషాల సమయం అయిపోయిందని చెప్పారు. బ్యాట్స్‌మెన్‌గా పరికరాలు సరిగ్గా ఉన్నాయో లేవో ముందుగా నిర్దారించుకోవాలని స్పష్టంచేశారు. 2 నిమిషాల్లో బంతి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పారు. ఆ వాదను మాథ్యూస్ (Mathews) తోసిపుచ్చారు. తనది అనవసరంగా ఔట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో అన్యాయం జరిగిందని అంటున్నారు.
టైమ్డ్ ఔట్ అంటే..?
వికెట్ పడిన సమయంలో తర్వాతి బంతిని ఎదుర్కొనేందుకు బ్యాటర్ రెండు నిమిషాల్లో క్రీజులోకి రావాల్సి ఉంటుంది. లేదంటే టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు.