Kamal Haasan-మణిరత్నం’ టైటిల్ రివీల్.. వీడియో అదిరింది!
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
Kamal Haasan: ‘నాయకుడు’ వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి కలిసి పని చేయలేదు కమల్ హాసన్, మణిరత్నం. ఇప్పుడు దాదాపు 36 ఏళ్ళ తరువాత ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. అందుకే.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే KH234 వర్కింగ్ టైటిల్‌తో లాంచ్ అయిన ఈ ప్రాజెక్ట్‌ను… రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. తమిళ్ హీరో జయం రవి, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అలాగే టైటిల్ కూడా లాంచ్ చేశారు.
నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు ఉండగా.. ఒక రోజు ముందుగానే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు మణిరత్నం. ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’ అనే ఇంగ్లీష్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ రిలీజ్ చేస్తూ టైటిల్ అనౌన్స్ చేశారు. గుర్తు పెట్టుకోండి.. తన పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ అని కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ముఖ్యంగా లోకనాయకుడి లుక్ ఓ రేంజ్లో ఉంది. దీంతో ఇప్పటి నుంచే సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల విక్రమ్ సినిమాతో కమల్ సాలిడ్ హిట్ అందుకోగా.. పొన్నియన్ సెల్వన్‌తో మణిరత్నం భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఇద్దరు కలిసి ‘థగ్ లైఫ్’గా ఆడియెన్స్ ముందుకు రానున్నారు.