Sharwanand: సినిమాలకు యంగ్ హీరో బ్రేక్.. కారణం అదే!
ఇటీవలె రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ అప్పుడే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
Sharwanand: జనవరి నెలలో శర్వానంద్, రక్షితా రెడ్డి నిశ్చితార్థం జరిగగా.. జూన్‌లో ఈ ఇద్దరు ఏడడుగుల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైపూర్‌లో అంగరంగా వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఒక ఇంట్రెస్టింగ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో శర్వానంద్ ఒక బిడ్డకు తండ్రి పాత్రలో నటించబోతున్నట్టు టాక్ ఉంది. ఇప్పుడు నిజంగానే తండ్రి కాబోతున్నాడు శర్వానంద్. అందుకే.. తన లేటెస్ట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తవడంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట శర్వానంద్. తన భార్య రక్షిత రెడ్డి ప్రెగ్నెంట్ కావడంతో.. కొద్దిరోజులు ఆమెతో గడిపేందుకు అమెరికాకి వెళ్లనున్నట్టుగా సమాచారం.
బిడ్డ పుట్టేవరకు భార్యకి తోడుగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. రక్షిత ఎక్కువగా అమెరికాలో ఉంటుంది కాబట్టి, తమ బిడ్డకి అక్కడే జన్మనివ్వనున్నారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో శర్వానంద్ అమెరికా ఫ్లైట్ ఎక్కనున్నాడట. అక్కడ రెండు మూడు నెలలు ఉండబోతున్నాడట. ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయిన శర్వానంద్.. చివరగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. దాంతో ఎలాగైనా సరే.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.