priya-prakash-varrier: ఒకే ఒక్క వీడియోతో నేషనల్ క్రష్ గా మారిన బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. జస్ట్ ఒక్క కన్ను కొట్టి, కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆ తర్వాత వెంటనే ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కట్టాయి. ఏవీ పెద్దగా క్లిక్ కాకపోవడంతో, క్రేజ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది. చేసిన తప్పులను తెలుసుకున్న ప్రియా వారియర్, అప్పటి నుంచి కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో ప్రియా వారియర్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ, నటనకు మంచి మార్కులేపడ్డాయి. మూవీ కూడా విజయం సాధించడంతో ఆఫర్లు పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాల మాట ఎటు ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉంటుంది.
తాజాగా బెనారస్ లెహంగాలో మెరిసింది. ఎద అందాలు స్పష్టంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇప్పుడు ఈ అందాలకు అందరూ ఫిదా అయిపోతున్నారు. సినిమాలతో ఎక్కువగా సందడి చేయకున్నా, ప్రియా వారియర్ ఎక్కువగా ట్రెండీ దుస్తుల్లో మెరుస్తూ ఉంటుంది. ఇటీవల బీచ్లో బికినీ వేసుకొని తన స్నేహితులతో కలిసి ఫుల్ రచ్చ చేసింది. ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.
ప్రియా వారియర్ బ్రో కంటే ముందు తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. ముందు నితిన్ సరసన ‘చెక్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ సరసన ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది.ఈ రెండు ప్రియాకు సక్సెస్ ను అందించలేకపోయాయి. కాగా, తెలుగు, తమిళంలోనూ నటించింది.