Vijayawada: విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్, ప్రయాణికురాలి మృతి
విజయవాడ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ప్లాట్ ఫారమ్‌పై నుంచి దూసుకెళ్లింది.
Vijayawada: విజయవాడ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ప్లాట్ ఫారమ్‌పై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ తో సహా, మరో ప్రయాణికురాలు, 10నెలల చిన్నారి మృతి చెందారు. బస్సు కిందపడి మరికొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ బస్టాండ్‌లోని 12వ ప్లాట్‌ఫారమ్‌లో చోటుచేసుకుంది.
బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రయాణికులపైకి వెళ్లడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా బస్సుపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక బస్టాండ్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.