ప్రముఖ హీరోయిన్ సమంత (Samantha) గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి అమెరికాలో కూడా చికిత్స తీసుకున్నారు. తాజాగా తన హెల్త్‌కు సంబంధించిన కీలక అప్ డేట్(Update)ను సమంత వెల్లడించారు.ఈ మేరకు ఆమె ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం కైరో థెరపీ(Chiro therapy) చేయించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ట్రీట్మెంట్ కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా స్టేటస్ (Insta status) లో షేర్ చేసింది. ఇందులో ఆమె పొగలు కక్కే చిలో ఓ టబ్ లో కూర్చుని కనిపించింది. చలి తీవ్రత -150 డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నట్లు అక్కడ డిస్ ప్లే లో కనిపిస్తోంది.
క్రయోథెరపీతో రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని, రక్త ప్రసరణ (blood circulation) సాఫీగా సాగుతుందని వివరించారు. మానసిక ఉల్లాసానికి ఈ క్రయోథెరపీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఇక సమంత చివరగా ‘ఖుషి’ మూవీ (Khushi movie)లో కనిపించింది. విజయ్ దేవరకొండతో కలిసి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ అందుకుంది. ఇక త్వరలోనే వరుణ్ ధావన్ (Varun Dhawan) తో కలిసి నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ లో రుస్సో బ్రదర్స్ దీన్ని తెరకెక్కించగా, రాజ్ అండ్ డీకే ఇండియన్ ఆడియెన్స్ కు అనుకూలంగా మార్పులు చేసి రూపొందించారు. అటు సమంత సల్మాన్ తో కలిసి త్వరలో ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.