»Amala Paul Married Her Boyfriend Jagat Desai In Kochi
Amalapaul: రెండో భర్తను పరిచయం చేసిన అమలాపాల్.. ఏమున్నాడ్రా బాబు
సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.
Amalapaul: సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఆదివారం స్టార్ హీరోయిన్ అమలా పాల్ కూడా తన ప్రియుడితో రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని దంపతులు స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ప్రకటించారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అమలా పాల్ ఇటీవల తన 32వ పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు జగత్ దేశాయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది.
నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అమలా పాల్ భర్త జగత్ దేశాయ్ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అమలా పాల్ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో 2014 సంవత్సరంలో జూన్ 7, 2014న కొచ్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు.. 5 రోజుల తర్వాత చెన్నైలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అమలా పాల్ తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలలో పనిచేసింది. హిందీలో ఆమె అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘భోలా’లో కనిపించింది.