»Varun Tej Lavanya Tripathi Wedding Reception In Hyderabad
Hyderabadలో ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్..హాజరైన ప్రముఖులు
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ విందు మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej),లావణ్యత్రిపాఠి రిసెప్షన్ హైదరాబాద్‌లోని ఎన్. కన్వెషన్ మాదాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. వరుణ్-లావణ్యల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక కోలాహలంగా జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై.. కొత్త దంపతుల్ని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ (Tollywood) తారల రాకతో రిసెప్షన్ కార్యక్రమం కళకళలాడింది. మరోవైపు వరుణ్ – లావణ్య(Lavanya)ల పెళ్లి, రిసెప్షన్ సందర్భంగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సామాజిక మాధ్యామాల్లో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్(Murali Mohan), వెంకటేశ్,నాగచైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ,సుకుమార్, యాంకర్ సుమ, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు విచ్చేశారు.