»Farmers Forced To Set Fire To Paddy Pile Bathinda Punjab Case Registered
Farmers forced: వరి కుప్పకు నిప్పంటించమని రైతుల బలవంతం..కేసు నమోదు
రైతుల పొలాల మంటలను నివారించాలని వెళ్లిన ఓ అధికారికి వింత అనుభవం ఎదురైంది. ఆ క్రమంలో ఓ ప్రాంతానికి వెళ్లిన అధికారిని ఆపిన రైతులు..అతనిచే వరి కుప్పను తగులబెట్టించారు. ఈ సంఘటనను ఓ రైతు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అక్కడి సీఎం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers forced to set fire to paddy pile bathinda punjab Case registered
పంజాబ్(punjab)లోని భటిండా(bathinda) జిల్లాలో పొలాల మంటలను నివారించేందుకు ఓ ప్రాంతానికి వెళ్లిన ఒక ప్రభుత్వ అధికారిని రైతుల(farmers) బృందం వరి కుప్పకు నిప్పంటించమని బలవంతం చేసింది. ఈ సంఘటన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ రైతులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించగా..ఈ వ్యవహారంపై రైతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు పేర్కొన్నారు.
అధికారి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్న రైతులపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాసినట్లు బటిండా డిప్యూటీ కమిషనర్ షోకత్ అహ్మద్ పర్రే శనివారం తెలిపారు. మెహ్మా సర్జా గ్రామంలో శుక్రవారం ప్రత్యేక పర్యవేక్షకుడి నేతృత్వంలోని ఓ బృందం పంటను దగ్ధం చేస్తున్న సంఘటనలను తనిఖీ చేయడానికి అక్కడికి వెళ్లిన క్రమంలో ఇది జరిగింది. ఒక రైతును పంట వ్యర్థాలను దగ్ధం చేయోద్దని అధికారి చెప్పినందుకు అక్కడ ఉన్న 50 నుంచి 60 మంది రైతులు అతన్ని చుట్టుముట్టారు.
అతన్ని సమీప పొలానికి తీసుకెళ్లి పొట్ట కుప్పకు నిప్పంటించమని బలవంతం చేశారని డిసి చెప్పారు. ఆ క్రమంలో చివరకు అతను పంట అవశేషాలకు నిప్పంటించేలా చేశారని అధికారి వెల్లడించారు. అగ్గిపుల్లతో పొట్టుకు నిప్పంటించమని బలవంతం చేయడంతో ఇద్దరు రైతులు అధికారి చేయి పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఓ రైతు తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేసినట్లు DC పర్రే చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. అన్యాయాన్ని సహించేది లేదని డీసీ అన్నారు.
అయితే పంజాబ్‌లోని వ్యవసాయ మంటలతోపాటు స్థానిక కారణాల వల్ల ఢిల్లీ(delhi) పరిధిలో గాలి తీవ్రంగా కాలుష్యమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏకంగా స్కూళ్లకు నవంబర్ 10 వరకు సెలవులు ప్రకటించారు. మరోవైపు హర్యానాలోని ఎనిమిది నగరాలు గత 24 గంటల్లో “తీవ్రమైన” గాలి నాణ్యత కాలుష్య సూచికల్లో నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలో “తీవ్రమైన” సగటు గాలి నాణ్యత ఉన్న 12 నగరాల్లో ఎనిమిది హర్యానాకు చెందినవి ఉన్నాయి. వాటిలో ఫతేహాబాద్ (466), ఫరీదాబాద్ (438), జింద్ (432), హిసార్ (425), సోనేపట్ (416), కైతాల్ (415), సిర్సా (414) మరియు గురుగ్రామ్ (404) ఉన్నాయి.