»Bus Accident In Rohini Of Delhi Uncontrolled Bus Crushes Vehicles
Viral Video: ఢిల్లీలో బీభత్సం సృష్టించిన బస్సు..ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Delhi: ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు అదుపుతప్పి వెళ్లడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బస్సు రోహిణి సెక్టార్ 3, 4 మధ్య డివైడర్ రోడ్డుపై వెళ్తుండగా.. ఆ సమయంలో బస్సు ప్రయాణికులను వదిలి డిపోకు వెళుతోంది.
అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పి కారు, రిక్షా, పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బస్సు డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో ఇలా జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు వచ్చి బస్సు డ్రైవర్ కిటికీని తెరిచారు. అప్పటికి డ్రైవర్ పూర్తిగా స్పృహలో లేడు. బస్సు అదుపు తప్పి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీ చాలా భయానకంగా ఉంది. అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పి కారు, రిక్షా, పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది.