»Revanth Reddy Criticised Cm Kcr Over Medigadda Barrage
Revanth Reddy: కేసీఆర్, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి
మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Congress Cpi Alliance In Telangana Assembly Elections
Revanth Reddy: సీఎం కేసీఆర్(KCR)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని, కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. దోచుకోవడానికే మేడిగడ్డ(Medigadda) బ్యారేజ్‌ను కట్టాడని, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ డొల్లతనాన్ని కేంద్ర కమిటీయే బయటపెట్టిందని విమర్శించారు. శనివారం హైదరాబాద్, గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవని, కేసీఆర్ వాటిని రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు. అంతేకాదు కేవలం పేరు మార్చి వేలకోట్లు దోచుకున్నాడని తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్మెంట్ వంటి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానకి ముఖ్యకారణం నిర్మాణంలో జరిగిన లోపమేనని వెల్లడించారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందన్నారు. మేడిగడ్డ కుంగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల నుంచి రూ.1. 51 లక్షల కోట్లకు అంచనాలను పెంచాడు కేసీఆర్. ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం ఆ వివరాలను దాచిపెట్టిందన్నారు. వేల కోట్ల నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదని ప్రశ్నించారు. బీఆరెస్, బీజేపీ రెండు ఒకటే అనడానికి ఇంతకన్నా ఏముంటుందని గుర్తు చేశారు.
కేసీఆర్ పాపం పండింది. సీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. అతని కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబమన్నారు. వీరిని తక్షణమే శిక్షించాలని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలి. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సంబంధిత శాఖల మంత్రులైన హరీష్ రావు, కేసీఆర్‌ను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ దీనిపై స్పందించాలన్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోడీ మెడిగడ్డను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి వాసన పడదంటున్న మోడీకి బీఆర్ఎస్ చేస్తున్నది కనిపించడం లేదా అని పేర్కొన్నారు.