»Beating The Drum And Playing Kolatam Rajaiah Campaigned Vigorously For Kadiam Srihari
Rajaiah: డప్పు కొట్టి, కోలాటం ఆడుతూ.. రాజయ్య జోరుగా ప్రచారం
స్టేషన్ ఘనపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ తెగ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి.
Beating The Drum And Playing Kolatam.. Rajaiah Campaigned Vigorously For Kadiam Srihari
Rajaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. అగ్రనేతలు, మంత్రులు, ఇతర నేతలు కూడా ప్రచార పర్వంలో నిమగ్నం అయ్యారు. స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి బరిలో ఉన్నారు. తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah) ధిక్కార స్వరం వినిపించారు. నామినేటెడ్ పదవీ ఇవ్వడంతో మెత్తబడ్డారు.
ఘనపురంలో కడియం శ్రీహరి ప్రచారం గురించి బయటకు అంతగా తెలియడం లేదు.. తాటికొండ రాజయ్య (Rajaiah) మాత్రం జోరుగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఓట్లు వేయాలనే కోరడం లేదు. డప్పు కొడుతూ అక్కడున్న వారిలో జోష్ నింపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతోంది. డప్పు కొడుతూ.. కాలు కదుపుతూ జోష్ మీద అందులో కనిపించారు.
మరో వీడియోలో రాజయ్య కోలాటం ఆడారు. బోనం ఎత్తుకున్న మహిళలతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. 36 సెకన్ల వీడియోలో రాజయ్య (Rajaiah) జోరుగా స్టెప్పులు వేశాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఇలా రాజయ్య ఘనపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.