Vivek Venkataswamy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇప్పటికీ కొందరు నేతలు పార్టీ మారుతున్నారు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ మారుతున్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. వాటిని అప్పట్లో ఖండించారు. ఎట్టకేలకు ఈ రోజు రాజీనామా చేశారు.
తెలంగాణ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని నోవాటెల్ హోటల్లో వివేక్ కలుస్తారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు. వివేక్‌కు చెన్నూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బరిలో ఉన్నారు.
Former MP Vivek Venkatswamy tenders resignation to BJP.
వివేక్ కూమారుడికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. వివేక్ సోదరుడు వినోద్‌కు ఇప్పటికే టికెట్ ఇచ్చింది. ఒకే ఇంట్లో మూడు టికెట్లు ఇచ్చినట్టు అవుతోంది. తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి వివేక్ పంపించారు. బీజేపీలో ఉన్న సమయంలో ఇచ్చిన మద్దతును మరవలేదన్నారు. బాధతోనే పార్టీని వీడుతున్నానని ప్రకటించారు.