మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ సినిమా. మరి టైగర్ పరిస్థతేంటి?
మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తు చేసిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అయితే ఈ సినిమాను కాస్త లెంగ్తీ రన్ టైంతో థియేటర్లోకి తీసుకొచ్చారు మేకర్స్. అందుకే.. డివైడ్ టాక్ రావడంతో.. వెంటనే ట్రిమ్ చేశారు. దాంతో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా 37 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న టైగర్ నాగేశ్వర రావు.. పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు రాబట్టాలంటే.. టైగర్ ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది.
కానీ రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవడం కష్టమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే దసరాకు రిలీజ్ అయిన సినిమాలు తప్పితే.. దీపావళి వరకు థియేటర్లోకి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కాబట్టి.. లాంగ్ రన్లో టైగర్‌కు బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందనే చెప్పాలి. ఇకపోతే.. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించగా.. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.
రేణుదేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. అయితే.. పాన్ ఇండియా టార్గెట్‌గా వచ్చిన ఈ సినిమా.. తెలుగు మినహా మిగిలిన చోట్ల పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. అందుకే.. అనుకున్నంత స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.