Nandamuri Balakrishna: 130 కోట్లు.. బాలయ్య మరో సెన్సేషన్!
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా, శ్రీలీల కీలక పాత్ర పోషించగా.. షైన్ స్క్రీన్ పతాకం పై రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకొచ్చిన భగవంత్ కేసరి భారీ ఓపెనింగ్స్ అందుకొని.. పండగ సీజన్ తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ వస్తోంది. ఫస్ట్ వీక్‌లో 112 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటి వరకు మొత్తంగా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ లెక్క ప్రకారంగా రూ.130 కోట్లు వసూళ్లు వచ్చాయి.
దీంతో బాలయ్య బాబు కెరీర్లోనే అత్యధిక స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో భగవంత్ కేసరి కూడా ఒకటిగా నిలిచింది. అయితే వరల్డ్ వైడ్‌గా రూ.67 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ వసూలు చేసిన భగవంత్ కేసరి.. 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా దసరా బరిలోకి దిగింది. ఇప్పటికే ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ.. మరో రెండు, మూడు కోట్ల షేర్ రాబడితే తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవరాల్‌గా భగవంత్ బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టినట్టే.
ఇకపోతే.. ఈ సినిమాతో వరుసగా మూడు వంద కోట్లు రాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు సార్లు 50 కోట్లు వసూలు చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో 109 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. అలాగే బోయపాటితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు.. సుకుమార్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తంగా… బాలయ్య మాత్రం ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు.