ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. అలాగే దేవర బిజినెస్ లెక్కలు కూగా స్టార్ట్ అయ్యాయి.
Devara: దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మొన్న ఎన్టీఆర్.. కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని చెప్పడంతో.. అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకు తగ్గట్టే దేవర బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. థియేట్రికల్ బిజినెస్‌ను ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి అనిల్ తడానీ ఏఏ ఫిలిమ్స్ సంస్థ.. దేవర నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాయి. ఓవర్సీస్ రైట్స్‌ను హంసిని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు తెలుగు బిజినెస్ బేరాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. దేవర రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్టుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కెరీర్లో ఇదే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ కానుంది. కానీ ప్రస్తుతం స్టార్ హీరోల రీజనల్ సినిమాలకే ఈ రేంజ్ బిజినెస్ జరుగుతోంది. అలాంటిది.. పాన్ ఇండియా అయినటువంటి దేవర సినిమాకు.. ఇది కాస్త తక్కువ బిజినెస్ అనే చెప్పాలి. త్వరలోనే ఈ డీల్ క్లోజ్ కానుందని అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఓవరాల్ దేవర బిజినెస్ ఎంతవరకు జరుగుతుందో చూడాలి.