చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యలో స్కేటింగ్ నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకేం చేస్తున్నాడు.
Mahesh Babu is learning to skate.. Do you know why?
Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే కదా. ఒక్కో సినిమాకు ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటు సినిమా చేస్తుంటాడు జక్కన్న. ఇక హీరోలు జక్కన్న కోసం రెండు మూడేళ్లు కేటాయించాల్సిందే. తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదిలిపెట్టడు రాజమౌళి. హీరోలు ఎంత రిస్క్ అయిన చేయాల్సిందే. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలానే చేశారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. త్వరలోనే మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబు ఫిజికల్‌గా రెడీ అవుతున్నాడు. ఇటీవల ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం కొన్ని రోజులు జపాన్ కూడా వెళ్లాడు. ఇప్పుడది రెగ్యూలర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి కోసం స్కేటింగ్ నేర్చుకుంటున్నాడట మహేష్ బాబు. ఇండియానా జోన్స్ తరహా సినిమా కాబట్టి.. మహేష్ ప్రపంచ సాహసికుడిగా అనేక అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో స్కేటింగ్ నేర్చుకుంటున్నాడట. మరోవైపు వర్క్ షాప్ ప్లానింగ్‌లో ఉన్నాడట జక్కన్న. కాబట్టి.. ఇప్పటి నుంచి మహేష్ బాబుని వదలడు రాజమౌళి. ఇదిలా ఉంటే, ఈ సినిమా కథ విషయంలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని అంటున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే నిధి, నిక్షేపాల వేటగా ఎస్ఎస్ఎంబీ 29 రూపొందనున్నట్టు టాక్. అలాగే.. హనుమంతుడ్ని ప్రేరణగా తీసుకొని రాజమౌళి మహేష్ పాత్రను డిజైన్ చేసినట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఈ సినిమాలో మహేష్ లుక్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయని అంటున్నారు. ఏదేమైనా.. సినిమాలోనే కాదు, బాక్సాఫీస్ దగ్గర కూడా ఈసారి మహేష్, రాజమౌళి వేట మామూలుగా ఉండదనే చెప్పాలి.