Movie Explanation: నాసీర్ సముద్రం ఒడ్డునా ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆసుపత్రికి ధారా, సాధిక్, అజ్జు పరుగెత్తుకుంటూ వస్తారు. ఎవరు చేశారు అని అడుగుతాడు ధారా. హాజీ అని చెప్పి చనిపోతాడు. నాసీర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఏడుస్తారు. అక్కడి నుంచి ధరా కోపంగా బయటకు రాగానే నాసీర్ వైఫ్ శవం కనిపిస్తుంది. అక్కడ హాబీబా ఏడుస్తుంది. ఆసుపత్రి నుంచి ధారా బయటకు వస్తుంటాడు. రాత్రి ఇంటిపై సకీనా ధారాతో మాట్లాడుతుంది. చాలా ఏళ్ల క్రితం తాను తీసుకున్న నిర్ణయం మూలంగానే తమ కుటుంబం చాలా కష్టాలపాలు అయిందని చెప్తుంది. ప్రతి నిర్ణయానికి ఒక మూల్యం ఉంటుందని దాన్ని ఈ జీవితంలోనే తీర్చుకుంటారని ఇదే అల్లా నిర్ణయం అని చెబుతుంది. ధారా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబం గురించి ఆలోచించు అని చెప్తుంది. తరువాత సీన్లో బిలావల్, పఠాన్ తమ గ్యాంగ్ తో ఆరీఫ్ ఉన్న చోటుకు వచ్చి ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్తాడు. ఇంట్లో ధారా గ్యాంగ్ తో అబ్దుల్లా వారికి పఠాన్ ఆశ్రయం ఇచ్చినట్లు చెప్తాడు. అదే సమయంలో అక్కడికి ఇస్మయిల్ వచ్చి అబ్దుల్లాను ఇవన్ని ఆపేయ్యమని చెప్తాడు. హబీబా నాన్నకు తిరగబడుతుంది. అదే సమయంలో ధారా లేచి నాసీర్ ను చంపినోన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి వెళ్లిపోతాడు.
చదవండి:Actress Pragathi : రెండవ పెళ్లి వార్తలపై మండిపడ్డ నటి ప్రగతి
మరో సీన్లో ఇస్మయిల్, అబ్దుల్లా ఇద్దరూ మాట్లాడుకుంటారు. ధారాను ఆపండి అని ఇస్మయిల చెప్తాడు. కాని ధారాను ఆపడం ఎవడి వల్లా కాదు అంటాడు. నేను బతికున్నంత వరకు ధారాకు ఏం కాదు అని అబ్దుల్లా మాట ఇస్తాడు. కట్ చేస్తే పఠాన్ మనుషులను వెతికి వెతికి కాల్చేస్తుంటారు ధారా గ్యాంగ్. అవి రోజు వార్త పత్రికల్లో వస్తుంటాయి. తరువాత సీన్లో ధారా మనిషిని బిలావల్ కాల్చేస్తాడు. దాన్ని చూసిన ధారా కోపం తెచ్చుకుంటాడు. దీని ద్వారా బాంబేలో శాంతి భద్రతలకు నష్టం వాటిళ్లిందని హాజీ గోదాములపై దాడి చేస్తాడు మల్లిక్. పోలీసు బలగాలతో దాడి చేయించి బంగారం అంతా సీజ్ చేస్తారు. ధారాను ఆయుధంగా వాడుకుందామని మల్లిక్ ఆలోచిస్తాడు. తరువాత సీన్లో హీజీ పఠాన్ లు మాట్లాడుకుంటారు. యాసీర్, ఆరీఫ్ లన సేఫ్ గా ఉంచడం మన లక్ష్యం అని హాజీతో అంటాడు పఠాన్. తరువాత సీన్లో మల్లిక్ ఒక ఇన్ఫార్మర్ దగ్గర విషయం తెలుసుకుని ధారా గ్యాంగ్ తో మాట్లాడానికి పిలుస్తాడు. వారికి యాసీర్, ఆరీఫ్ లు ఉన్న అడ్రెస్ చెప్తాడు. దానికి ధారా ఎందుకు మాకు హెల్ప్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి పఠాన్ గ్యాంగ్ ను ఫినిష్ చేయ్ అని ఆ తరువాత నిన్ను ఓ సాయం అడుగుతానని చెప్తాడు మల్లిక్. యాసీర్, ఆరీఫ్ లు అమ్మాయితో డ్యాన్స్ చేస్తు మజా చేస్తుంటారు. బెల్ కొట్టిన సౌండ్ కావడంతో ఎవరా అని చూస్తే ధారా, అబ్దుల్ ఇద్దరూ వచ్చి అక్కడ మనుషులను చంపేస్తారు. యాసీర్, ఆరీఫ్ లను గల్లీలో కొట్టి కొట్టి చంపేస్తుంటే కొందరూ పైన ఇళ్లలోంచి చూస్తారు. యాసీర్ గుడ్డలు ఊడదీసి కత్తితో పొడిచి దారుణంగా చంపేస్తాడు ధారా. తరువాత సీన్లో హాజీ, పఠాన్ లు వారి శవాలను ముందు కొన్ని రోజులు ఈ హింసను ఆపేద్దాం అనుకుంటారు. మరో సీన్లో పోలీసులు మాట్లాడుకుంటారు. ధారాను అడ్డుపెట్టుకొని పఠాన్ గ్యాంగ్ ను మూసిద్దాం అని మాట్లాడుకుంటారు. మరో సీన్లో బిలావల్ హాజీతో సిరీయస్ గా మాట్లాడుతారు. మనం పోట్లాడుకుంటుంటే ధారా పని మరింత సులువు అవుతుందని దాని కోసం ఓ ప్లాన్ చేయాలని హాజీ ఆలోచిస్తాడు.
తరువాత సీన్లో మజీదులో పిల్లలకు మంచిని బోధిస్తుంటాడు ఇస్మయిల్. అక్కడికి హాజీ తన కార్లో వస్తాడు. ఇస్మయిల్ కారు ఎక్కుతాడు. తన అవసరం ఉందని హాజీ అంటాడు. ధారాను ఒక సారి వచ్చి కలువమని చెప్తాడు. దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇస్మయిల్ కారు దిగి వెళ్లిపోతాడు. మరో సీన్లో పఠాన్ గ్యాంగ్ ను సమూలంగా అంతం చేయాలని మాట్లాడుకుంటారు ధారా గ్యాంగ్. అక్కడికి ఇస్మయిల్ వస్తాడు. హాజీ కలువాలంటున్న విషయం చెప్తాడు. నాసీర్ పై ప్రతికారం తీర్చుకున్నావు కదా ఇప్పుడు చేయి కలుపు అంటాడు. దానికి కుదరదని సాధిక్ అంటాడు. ఎప్పుడు కలువాలి అని ధారా అడుగుతాడు దాంతో అందరూ షాక్ అవుతాడు. కట్ చేస్తే ధారా హాజీని కలువడానికి వెళ్తాడు. ఇస్మయిల్, ధారా ఇద్దరూ కలిసి వస్తున్నట్లు ఓపికతో ఉండండి లేదంటే దందా పాడైపోతుంది అని తన వాళ్లతో హాజీ చెప్తాడు. అక్కడికి వచ్చిన ధారా గ్యాంగ్ వాళ్ల ముందు కూర్చుంటాడు. మాతో చేయి కలుపు అంటాడు. దానికి సమానం భాగం ఇవ్వమని అడుగుతాడు. ఆ మాటలకు పఠాన్ కొప్పడుతాడు. దాంతో బోంబైలో జరిగే దందాలో మూడోంతులు మీవి, ఒక వంతు నాది అని వారికి 10 నిమిషాలు టైమ్ ఇచ్చి భయటకు వెళ్తారు ధారా గ్యాంగ్. హాజీ తన మనుషులతో మాట్లాడుకుంటారు. ధారా గ్యాంగ్ బయట వెయిట్ చేస్తారు. తరువాత హాజీ సాబ్ రమ్మంటున్నారని లోనికి పిలుస్తారు. ధారా తన మనుషులతో లోపలికి వెళ్తాడు. హాజీ రక్త పాతం జరగదు అని మాటిస్తే నీతో దందా చేయడానికి ఒప్పుకుంటా అని ఖురాన్ షేరిఫ్ మీద ఒట్టు పెట్టించుకుంటారు.
బాంబై 1981లో కథ సాగుతుంది. పఠాన్ చెప్పిన ప్లాన్ అమలు పరుస్తూ ధారా దందా మొదలుపెడతుతాడు. సాధిక్ పెళ్లి సంబంధం కుదరడంతో ఇస్మయిల్ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. పెళ్లి హడావిడి మొదలౌతుంది. వారి దగ్గర ఉన్న డబ్బుతో రకరకాలుగా రెడీ అవుతుంటారు. అయితే ఈ విషయంలో ఇస్మయిల్ మాత్రం సంతోషంగా ఉండడు. తరువాత సీన్లో పారికోసం ధారా హబీబాతో కలిసి షాపింగ్ చేస్తాడు. షాపింగ్ చేసిన గాజులను ధారా ఇవ్వమన్నడు అని హబీబా పారికి ఇవ్వబోతుంది. దాన్ని తిరస్కిరించి ధారానే ఇవ్వమని చెప్తుంది. తరువాత సీన్లో పారి వద్దన్న విషయం చెప్పి ధారానే ఇవ్వమన్నది అనే విషయాన్ని దాచిపెడుతుంది హబీబా. నిశ్చితార్థం వేడుక మొదలు అవుతుంది. మెహంది సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అదే సమయంలో కారు కొంటారు. సొంత కార్లో అందరిని తీసుకెళ్తాడు ధారా. నెక్ట్స్ సీన్లో పారి చెప్పిన విషయాన్ని హబీబా ధారాతో చెప్తుంది. పారి వస్తే నన్ను తక్కువగా చూస్తవని చెప్పలేదని చెప్తుంది. తరువాత అందరూ కలిసి బ్రోతల్ హౌస్ దగ్గరకు వెళ్తారు. అక్కడ జయశ్రీ అనే అమ్మాయిని బుక్ చేసుకుంటాడు సాధిక్. అక్కడికి చిత్ర అనే అమ్మాయి వచ్చి తనతో పరిచయం ఉన్నట్లు చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో అబ్దుల్లా, ధారా మాట్లాడుకుంటారు. మల్లిక్ కలువాలని అబ్దుల్లా ధారాతో చెప్తాడు. తరువాత సీన్లో పారితో మాట్లాడానికి ఆఫీస్ కు వెళ్తాడు ధారా. తరువాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. అక్కడనుంచి ఇద్దరూ స్కూటర్లో బయటకు వెళ్తారు. తరువాత ఒక టీ కొట్టులో కలిసి మాట్లాడుకుంటారు. పారిపై తన ఇష్టాన్ని చెప్తాడు.
తరువాత సీన్లో అందరూ కలిసి షాపింగ్ చేస్తారు. అక్కడికి ఇస్మయిల్ వచ్చి కొప్పడుతాడు. మన స్థోమత ఏంటని మాట్లాడుతాడు. హబీబాను కొప్పంగా చూసి వెళ్తాడు. హబీబా తన అబ్బు గురించి ఏదో మాట్లాడుతుంది. దానికి సకీనా కొప్పడుతుంది. తన వెనక ఎవరు మాట్లాడిన ఊరుకోను అంటుంది. అక్కడి నుంచి రూమ్ లోకి రాగానే ఇస్మయిల్ తన బట్టలు సర్ధుకుంటుంటాడు. బయటికి వెళ్లిపోతానని సకీనాతో చెప్పి ఇళ్లొదిలి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో ఇంట్లో అన్నదమ్ములు అందరూ పరేశాన్ లో ఉంటారు. అక్కడికి ధారా వస్తాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. ఏం అయిందని అడుగుతాడు ధారా.. అబ్బు ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు అని చెప్తాడు. దాంతో వెళ్లి తీసుకొద్దామని అనే సరికి సకీనా వారిని వారించి భోజనం తీసుకొని ఇస్మయిల్ అద్దేకు తీసుకున్న ఇంటికి వెళ్తుంది. ఇస్మయిల్ కు భోజనం ఇచ్చి తనతో తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతుంది. తమ గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతుంది. తన తమ్ముడిని కాపాడుకునే క్రమంలో ఇంటిని నాశనం చేసుకున్నాను బాధపడుతుంది. ధారాలో కూడా నీలానే కోపం, మొండితనం ఉందని తన భర్తతో అంటుంది. అలాగే ఇప్పుడిప్పుడే కుటుంబంలో సంతోషం ఉందని తన కొడుకు పెళ్లికి రావాలని చెప్పి వెళ్తుంది. తరువాత సీన్లో సాధిక్ పెళ్లికి ఇస్మయిల్ రాలేదని మౌళ్వీ అడుగుతుంటాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్న సమయంలో అక్కడి ఇస్మయిల్ వస్తాడు. పెళ్లి జరుగుతుంది. అక్కడినుంచి ఇస్మియిల్ లేచి వెళ్లిపోతాడు. సాధిక్ కు ఒక పక్క సంతోషం బాధ రెండు ఉంటాయి. మరో సీన్లో పఠాన్ తన వాళ్లతో నల్ల మందు తాయారు చేస్తూ ఉంటాడు. అందలో 50 కిలోలు ధారాకు పంపించు అని పఠాన్ చెప్తాడు. అదే సమయంలో పఠాన్ మనిషి ధారా విషయంలో కొప్పడుతుంటాడు. దానికి శత్రువును ఎప్పుడూ పక్కనే ఉంచుకోవాలి అని ఇదే హాజీ నీతి అని పఠాన్ చెప్తాడు. తరువాత విందు జరుగుతుండగా అక్కడికి అందరూ గెస్టులు వస్తారు. అక్కడికి హాజీ అరబ్బులతో వస్తాడు. తరువాత అక్కడికి పఠాన్ తన ముషులతో వస్తాడు. అందరూ కలిసి ఫోటో దిగితారు. తరువాత సీన్లో హాజీతో వచ్చిన అరబ్బులతో పరిచం పెంచుకొని దందా చెద్దామని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే సాధిక్, అబ్దుల్లా, ధారా ముగ్గురు బోంబై నుంచి దుబాయ్ బయలు దేరుతారు. అక్కడ షేక్ వాహాబ్ ను కలుస్తారు. అయితే వారితో దందా చేయడం ఇష్టం లేదని ఇప్పుడు ఉన్న దందా బాగుందని చెప్తాడు హహాబ్. దానికి ధారా కోపం తెచ్చుకుంటాడు. అబ్దుల్లా కాస్త కూల్ గా మాట్లాడి డీల్ చేస్తాడు. దాంతో వారు కూడా ఒప్పుకుంటారు. వీరి కంపెనీకి డీ అని పేరుపెడుతారు. వినుత్నంగా స్మగ్లింగ్ చేస్తుంది డీ కంపెనీ. కొంత మంది కుర్రాలను వారి కంపెనీలో చేర్చుకొని దందాను హుషారుగా చేస్తారు. ఈ ఢీ కంపెనీ గురించి హాజీతో పఠాన్, అన్నారాజన్ చెబుతారు. దానికి ఎలా జరుగుతుందో అలానే జరగనివ్వండి అని చెప్పి వెళ్తాడు హాజీ. గోదమ్ లైన్ ద్వారా స్మగ్లింగ్ చేస్తాడు. కంపెనీ పెద్దది అవుతుంది. పోలీసు ఆఫీసర్ మల్లిక్ కూడా ధారాతో స్నేహంగానే ఉంటాడు. షేక్ హాబీబ్ తో మీటింగ్స్, తరువాత కొత్త కార్లు, గెటప్ ఛేంజ్ చేసుకుంటారు ధారా. ఆ సమయంలో పర్సెంటేజ్ పెంచమని అడగాలని ధారా ఆలోచిస్తుంటే నేను మాట్లాడుతా అని సాధిక్ అంటాడు. వద్దు అబ్దుల్లాను మాట్లాడమని ధారా చెప్తాడు. అది సాధిక్ మనుసును గాయం చేస్తుంది. తరువాత సీన్లో పారి కోసం సూట్ వేసుకొని రెడీ అవుతుంటాడు. ఆ సమయంలో దుబాయ్ కి నువ్వు వద్దు అని ఈ సారికి బొంబైలోనే ఉండిపో అంటాడు ధారా.. ఆ మాటలకు మరింత హట్ అవుతాడు సాధిక్. 5 స్టార్ హోటల్లో ఫుడ్ బాగలేక బయటికి వచ్చేస్తారు ధారా పారి. రాత్రి సాధిక్ కు నిద్ర పట్టదు. అదే రాత్రి బయటకొచ్చి రొడ్డు మీద ఫుడ్ తింటారు ధారా పారి. తరువాత వాళ్లు ఏకంతాంగా గడపడానికి హోటల్ కు వెళ్తారు. సాధిక్ చిత్ర దగ్గరకు వెల్లి తనతో గడుపుతాడు. తరువాత పారితో తన తండ్రి అయిన పటేల్ ను కలవాలని చెప్తాడు. ముందు తానే మాట్లాడి చెప్తా అని పారి అంటుంది.
తరువాత సీన్లో ధారాను అడ్డుకోవాలని పఠాన్ మనుషులు అంటుంటారు. బిలావల్ కూడా ఏదోటి చేయాలి అంటాడు. మనం ధారాను చంపలేమని పఠాన్ అంటాడు. కట్ చేస్తే గన్య సర్వే డైనింగ్ టేబుల్ పై కూర్చొని తింటుంటాడు. అక్కడ అందరిని చంపేస్తాడు. కదులుతున్న ఒకతన్ని చంపి జూస్ తాగి అక్కడినుంచి వెళ్లిపోతాడు.
గన్యకు ఫోన్ వస్తుంది. కట్ చేస్తే పఠాన్ ను కలుసుకుంటాడు. ధారాను చంపడానికి 20 లక్షలు సుపారి ఇస్తామని చెప్తాడు. తాను 1 కోటి అడుగుతాడు. అంత ఎందుకు అంటే మొత్తం అందరిని సమూలంగా చంపాలి అని, తన ఫ్యామిలీని కూడా చంపుతా అని చెప్తాడు. సాధిక్ రోజు ఆ చిత్ర దగ్గరకు వెళ్తున్నాడని హబీబాతో చెప్తూ ఏడుస్తుంది కైజర్. అదే విషయాన్ని ధారాతో హబీబా చెప్తుంది. నెక్ట్స్ సీన్లో సాధిక్ ను ధారా అడగడానికి వెళ్లి ఆ విషయం అడగకుండా వారి దందా గురించి మాట్లాడుకుంటారు. సాధిక్ ఆలోచనలో పడుతాడు. నెక్ట్స్ సీన్లో ధారా బెంజ్ కార్లో దిగుతాడు. అందరికి అతనికి సలాం చేస్తారు. ధారా ఇస్మయిల్ ఉంటున్న గదికి వస్తాడు. ఇంటికి వెళ్దామని అడుగుతాడు. సాధిక్ వేశ్య వలలో పడ్డాడని చెప్తాడు. నువ్వు ఇంటికిరా అంటే ఇస్మయిల్ ఒప్పుకోడు. నేను చెప్పింది ఎవరు విన్నారు అని మాట్లాడుతాడు. దానికి నువ్వు కూడా హాజీ కింద పనిచేశావు అని, నువ్వు గుండాల కింద పని చేశావు. నేను గుండాలను యాజమాని అయ్యానని చెప్తాడు ధారా. అయినా సరే ఇస్మయిల్ ఒప్పుకోడు. నమాజుకు సమయం అయ్యిందని సైతాన్ పిలిస్తే వెళ్లనని నమాజుకు వెళ్లిపోతాడు. తరువాత సీన్లో సాధిక్ తండ్రి అవుతున్నాడని అందరూ సంతోష పడుతుంటారు. అదే సమయంలో నేనూ కూడా దుబాయ్ కి వస్తా అంటాడు సాధిక్. కాని వదినకు నీ అవసరం ఉందని చెప్పి అతను వెళ్లిపోతాడు. తరువాత అరబ్ లతో సంబంధాలు పెట్టుకొని వేగంగా ఎదుగుతుంటాడు ధారా. నెక్ట్స్ సీన్లో చిత్ర దగ్గరికి వెళ్తాడు సాధిక్. దుబాయ్ కి ఎందుకు వెళ్లలేదు అని అడుగుతుంది చిత్ర. సాధిక్ ఆలోచనలో పడుతాడు. ఆ సమయంలో ధారాకు సాధిక్ కు ఉన్న బేధం గురించి మాట్లాడుతుంది చిత్ర. తరువాతి సీన్ల ఖాద్రీ ఫ్యామలీనే లేపాస్తావా అని గన్యను చూసి నవ్వుతారు పఠాన్ మనుషులు. తరువాత సీన్లో జయశ్రీని గన్య కలిసి సాధిక్ చిత్ర దగ్గరకు వచ్చినప్పుడు చెప్పమని చెప్తాడు. తరువాత సీన్లో అబ్దుల్లా, ధారా ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి వస్తారు. నెక్ట్స్ పారి తన నాన్నతో ధారా విషయంలో గొడవ పడుతుంది. అదే సమయంలో ధారా ఇంటికి వచ్చి పారిని తీసుకెళ్తా అంటాడు. దానికి దారీస్ పటేల్ తిడుతాడు. దాంతో ధారా అతని పీక పట్టుకుంటాడు. ఆ ఘటనతో పారి ధారాను వెళ్లిపో అంటుంది.
మరో సీన్లో ధారా ఇంటిదగ్గర కూర్చొని బాధపడుతుంటాడు. అక్కడికి హబీబా వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదు అని ధారా చెప్తాడు. హబీబా ఇస్మయిల్ కు భోజనం తీసుకొని వెళ్తుంది. ధారా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి అబ్దుల్లా వచ్చి పఠాన్ గ్యాంగ్ ఏదో చెయ్యబోతుంది అని చెప్తాడు. ఇస్మయిల్ కోసం అబ్దుల్లా వస్తాడు. అక్కడ హబీబా ఉంటుంది. పఠాన్ గ్యాంగ్ ఏదో చేయబోతుంది అని తనకు గన్ ఇచ్చి వెళ్తాడు.
తరువాత సీన్లో సాధిక్ తన వైఫ్ తో గొడవపడుతాడు. తనను నెట్టెస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ధారా ఏం జరిగింది అని అడుగుతాడు. ధారాపై సాధిక్ కొప్పడి చేయి కూడా లేపుతాడు. అక్కడి నుంచి సాధిక్ నేరుగా చిత్ర దగ్గరకు వెళ్తాడు. అక్కడ కూడా అరుస్తాడు. అదే సమయంలో అక్కడ జయశ్రీ ఉంటుంది. కిందికి వచ్చి గన్యకు ఫోన్ చేసి సాధిక్ వచ్చినట్లు చెప్తుంది. గన్య తన మనుషులతో బయలుదేరుతాడు. చిత్ర సాధిక్ ను కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్దాం అని చిత్రను తీసుకెళ్తాడు సాధిక్. తనకు పిల్లాడు పుడుతున్నాడని, ఒక మంచి తండ్రిని కావాలనుకుంటున్నట్లు చిత్రతో చెప్తాడు. దాంతో చిత్ర కూడా తమ ప్రేమ గుర్తుగా కొడుకును కంటా అని పెళ్లి చేసుకో అని అంటుంది. అన్ని వదిలేస్తా అంటే పెళ్లి చేసుకుంటా అని సాధిక్ చిత్రతో అంటాడు. దానికి చిత్ర కూడా ఎమోషనల్ అవుతుంది. మరో సీన్లో గన్య మనుషులు ఇస్మయిల్ పై దాడి చేయడానికి వస్తారు. వారిలో ఒకరిని హబీబా కాల్చి చంపేస్తుంది. తరువాత సీన్లో సాధిక్ తో ఏదైనా గొడవ జరిగిందా అని సకీనా అడుగుతుంది. మరో సీన్లో గన్య మనుషులు దాడికి ప్రయత్నిస్తుంటారు. సాధిక్ మంచి వాడు అని తల్లి ధారాతో చెప్తుండగా గన్ సౌండ్ వినిపిస్తుంది. ధారా చూసి కింద దాచుకుటంటాడు. అబ్దుల్లా ఎదరుదాడి చేస్తాడు. హాబీబా, ఇస్మయిల్ బయటకు పరుగెత్తుకుంటు వస్తారు. ఇంట్లో గన్స్ పేలుతూనే ఉంటాయి. ఒక్క సారిగా నిశ్శబ్దం.. తరువాత లోపలి నుంచి ధారా తన గ్యాంగ్ అంతా గన్స్ తో కాలుస్తూ వస్తుంటారు. గన్య మనుషులు బయటకు పరుగెత్తుకుంటూ వస్తారు. వాళ్లను అందరిని కాల్చేస్తారు ధారా గ్యాంగ్. అందరూ ఇంట్లోకి వెళ్లి సకీనాను కలుసుకుంటారు. సాధిక్ ఎక్కడా అని ఆలోచిస్తారు. సాధిక్ చిత్రతో కార్లో వస్తుంటారు.
బాంబై అంతా నిశ్శబ్ధంగా ఉంటుంది. పోలీసులు జీపులు వస్తుంటాయి. ఇస్మయిల్ ఏడుస్తుంటాడు. సాధిక్ ను చంపేస్తారు. అతని చుట్టు అందరూ ఉంటారు. అతని అంత్యక్రియలు జరుగుతుంటాయి. రాత్రి చిత్ర, సాధిక్ ఇద్దరు కార్లో వస్తుంటారు. వారు ఒక పెట్రలో బంక్ దగ్గర ఆగగానే వేరే కారులొంచి కాల్పులు జరుపుతారు గన్య అండ్ బ్యాచ్. ఆ దాడిలో చిత్ర చనిపోతుంది. అదే సమయంలో సాధిక్ శవాన్ని తీసుకొని వెళ్తుంటారు. చిత్ర చనిపోయింది అన్న కోపంతో కారు నుంచి పైకీ లేవగానే గన్య తన మనుషులు సాధిక్ ను చంపేస్తారు. ఆ కార్యక్రమంలో హాజీ వచ్చి ఇస్మయిల్ కు ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్తాడు. ఇంట్లో సకీనా ఏదో వెతుకుతూ ఉంటుంది. అక్కడికి హబీబా వస్తుంది. తనతో ఏదోదో మాట్లాడుతుంది. తన కోడలు వాళ్ల అమ్మాగారింటికి వెళ్లిపోయిందని ఏడుస్తుంది. సాధిక్ చనిపోయినందుకు విపరీతంగా ఏడుస్తుంది. తరువాత సీన్లో ఇస్మియిల్ కూర్చొని బాధపడుతుండగా అక్కడికి ధారా వచ్చి పక్కన కూర్చుంటాడు. ఈ యుద్దం ఆపేయ్యమని ఇస్మయిల్ చెప్తాడు. దానికి సైలెంట్ గా వెళ్లిపోతాడు ధారా. తరువాత సీన్లో పోలీసులు ధారా బలం గురించి, ఆ హత్య గురించి మాట్లాడుకుంటారు. మరో సీన్లో హాజీ పఠాన్ మనుషులతో గొడవ పడుతుంటాడు. ఒక సారి ధారాను కెలికి వాన్ని బాంబేకి హీరోను చేశారని, మళ్లీ వాని అన్ని చంపి ఇంకేం చేస్తారని అరుస్తాడు. దానికి పఠాన్ హాజీని హెచ్చరిస్తాడు. దందా నాశనం అయిందని హాజీ బాధపడుతుంటాడు. కాని పఠాన్ హాజీకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు. హాజీని వెళ్లిపోమ్మని పఠాన్ బిలావల్ తో చెప్తాడు. దానికి హాజీ వెళ్లిపోతాడు. నెక్ట్స్ సీన్లో జయశ్రీ ఇన్ఫార్మార్ అన్న విషయం ధారాకు తెలుస్తుంది. అక్కడికి పారి వస్తుంది. సాధిక్ విషయంలో బాధపడుతున్నట్లు ఏడుస్తుంది. ధారా ఏం మట్లాడు పారి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్ట్స్ సీన్లో వాళ్లు కుక్క చావు చావాలని అని హబీబా ధారాతో చెప్తుంది. ధారాకు హాజీ నుంచి ఫోన్ వస్తుంది. తనను కలువాలని చెప్తాడు. ధారాను కలువడానికి మల్లిక్ వస్తాడు. సాధిక్ ను చంపింది గన్య అని చెప్తాడు. వాన్ని చంపమని ధారా చెప్పి పంపింస్తాడు. వాడు చేయకపోతే వీళ్లు చంపాల్సిన లిస్ట్ లో మల్లిక్ పేరు కూడా యాడ్ చేయమని ధారా చెప్తాడు.
మరో సీన్లో బిలావల్, పఠాన్, గన్య తన మనుసులతో మీటింగ్ పెట్టుకుంటారు. ధారాను చంపాలని ప్లాన్ చేసుకుంటారు. మల్లిక్ ధారాకు ఫోన్ చేసి గన్య అడ్రస్ గురించి చెప్తాడు ఇది గన్య ప్లాన్ లో భాగమే. మరో సీన్లో పఠాన్, అన్నా రాజన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ రోజు గన్య, లేదా ధరా ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని మాట్లాడుకుంటారు. కట్ చేస్తే ధారా కోసం గన్య మాటువేసుకొని ఉంటాడు. అక్కడి ధారా కారు వచ్చి కాసేపు ఉండి వెళ్లిపోతుంది. గన్యకు ఏం అర్థం కాదు గన్స్ పట్టుకొని అక్కడికి రాగానే పోలీసులు వచ్చి ఎన్ కౌంటర్ చేస్తారు. మల్లిక్ చేతులో గన్య ఎన్ కౌంటర్ అవుతాడు. అక్కడికి ధారా, అబ్దుల్లా ఇద్దరూ వచ్చి చూస్తారు. మల్లిక్ తనను తాను కాల్చుకుంటాడు. తరువాత సీన్లో మల్లిక్ కు తన పై ఆఫీసర్ ఫోన్ చేసి ఇది నకిలి ఎన్ కౌంటర్ అని తెలిస్తే బాగుండదు అని చెప్తాడు.
తరువాత సీన్లో మిగితా వారిని కూడా చంపాలని ప్లాన్ చేస్తుండగా.. మల్లిక్ ఫోన్ చేస్తాడు. ఇకపై ఎన్ కౌంటర్ చేయడానికి వీలు లేదు అని చెప్తాడు. పఠాన్ మనుషులను అన్నారాజన్ దగ్గర పెడుతాడు. అక్కడికి వెల్లి చంపడం కుదరదు అని ధారా మనుషులు ప్లాన్ చేసుకుంటారు. అన్నా రాజన్ ఇంటిదగ్గర భోజనాలు పెట్టె సమయంలో వడ్డిచ్చే వారు గన్స్ తీసుకొని ఫైర్ చేస్తారు. అక్కడికి ధారా వస్తాడు. అన్నా రాజన్ కాల్చి చంపేస్తాడు. తరువాత హరున్, రైజ్ దాదా కోసం ధారా మనుషులు వెంబడిస్తారు. తరువాత సీన్లో హరున్, తప్పించుకున్నాడు అని, రైజ్ దాదా ఖైదీ అయ్యాడని చెప్పా బిలావల్ పఠాన్ కు చెప్తాడు.
ధారా తన మనుషులతో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు వారు బయట మనిషికి సుపారి ఇవ్వగలిగితే మనమెందుకు జైల్ లో ఉన్నవారికి ఇవ్వొద్దు అని అంటుంది. దానికోసం ఓ షార్ప్ షూటర్ ను వెతకమని చెప్తుంది. కట్ చేస్తే షూటర్ చోటా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్లో తన వైఫ్ ను తన ప్రియుడిని షూట్ చేసి బయటకు వచ్చి గణపతిని మొక్కి డ్యాన్స్ చేస్తుంటాడు. కట్ చేస్తే తాను ఒక బన్నుల ఫ్యాక్టరీలో పని చేస్తుంటే అక్కడ ఓ పిల్లాడు వచ్చి బాయ్ కలువాలని చెప్తాడు. బాయ్ కౌన్ అనుకుంటాడు. కట్ చేస్తే ధారాను కలువడానిక చోటా బబ్బన్న వెళ్తాడు. నా కింద పని చేస్తావా అని అడిగితే లేదు అంటాడు. అందరూ షాక్ అవుతారు. అంతలో మీతో పాటు పని చేస్తా అంటాడు. అది విని ధారా చిన్నగా నవ్వుతాడు. హాజీకి ధారా దొరికినట్లు, ధారాకు చోటా బబ్బన్ దొరికాడు. రైజ్ దాదాను చంపాలని చెప్తాడు. దానికి ఎంత తీసుకుంటావు అంటే సాధిక్ కోసం చేస్తా అంటాడు. అది విన అజ్జు నేను చేస్తా అని అరుస్తాడు. దానికి సాధిక్ ను పొగొట్టుకున్నాను, నిన్ను కూడా పోగొట్టుకోలేనని ధారా చెప్తాడు. దానికి అజ్జు కోపంగా వెళ్లిపోతాడు. రైజ్ దాదాకు పోలీసుస్టేషన్ లో ఏం కాకూడదు అని మల్లిక్ ఆఫీసర్ తో చెప్తాడు. ధారాకు, మల్లిక్ కు ఉన్న సంబంధం గురించి ఆఫీసర్ మాట్లాడి బెదిరిస్తాడు. తరువాత సీన్లలో డీ కంపెనీ ఎదుగుతుందని, రైజ్ దాదాను చంపాలని చోటా ప్లాన్ చేస్తుంటాడు. పఠాన్ పని అయిపోయిందని ఇప్పుడు అంతా ధారా టైమ్ నడుస్తుందని చెప్తాడు. అక్కడికి పరదేశి వస్తాడు. అతనికి కొన్ని డబ్బుల ఇచ్చి పని చేయమని చోటా చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో పోలీసు స్టేషన్లోకి చాయ్ తీసుకొని ఓ అబ్బాయి వస్తాడు. అంతలో అక్కడికి మల్లిక్ వచ్చి రైజ్ దాదాను అండా సెల్ లో వెస్తారు. అదే విషయాన్ని చాయ్ అబ్బాయ్ చెప్తాడు. దీని గురించి చోటా ధారాతో మాట్లాడుతుంటాడు. కోర్టులో రైజ్ దాదాకు చెక్ పెడుతారు.
హరున్ ను ప్రశాంతంగా ఉండమని పఠాన్ ఫోన్ చేసి చెప్తాడు. ధారాకు చెక్ పెట్టిన తరువాత నిన్ను పిలుస్తాము అని చెప్తాడు. అదే విషయాన్ని బిలావల్, పఠాన్ ఇద్దరూ ధారా పని అయిపోయిందని మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో ఇస్మియిల్ కూరగాయలు కొంటుండగా అక్కడికి మల్లిక్ వస్తాడు. ధారాకు ఒక మాట చెప్పి చూడు అని చెప్తే.. ఆరోజు ముగ్గురిని అరెస్ట్ చేసి ఉంటే తన కొడుకు బతికిఉండేవాడు అని ఇస్మయిల్ అంటాడు, ధారా దగ్గర డబ్బులు తీసుకోని ఉండకూడదు అని అంటాడు. ఈ యూనిఫామ్ లో దమ్ము ఉంటే నీ పవర్ చూపించు అంతే కాని ధారా ఇప్పుడు ఎవరు చెప్పినా వినడు అని అని వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో సకీనా హర్ట్ లో హోల్ ఉందని డాక్టర్ చెప్తాడు. సకీనాతో ఇస్మియిల్ మాట్లాడుతుంటాడు. వారు ప్రేమగా మాట్లాడుకుంటారు. మరో సీన్లో ధారా దగ్గరకు అజ్జు వచ్చి సాధిక్ బాయ్ చెప్పులు నాకు సరిపోయాయి అని చెప్తాడు. తన స్థానంలో వస్తా అని కాదు, కాని నీకు నేను తోడు ఉంటానని ధారాతో అజ్జు అంటుంటాడు. ఇద్దరు ఎమోషనల్ అవుతారు. మరో సీన్లో పరదేశిని వెతుకుతూ చోటా, తన ఫ్రెండ్ ఇద్దరు క్లబ్ కు వెళ్తారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ధారాకు చెప్తాడు. లైఫ్ లో రిస్క్ తీసుకుంటా అని చెప్పి నేనే రైజ్ దాదాను చంపెస్తా అని, తన దగ్గర విష్ణు, నామ్ దేవ్ ఇద్దరు మనుషులు ఉన్నారని, కోర్టులో ఏదైనా తప్పుగా జరిగితే వాళ్లను మీ దగ్గరే ఉంచుకోండ్రి అని చెప్పి వెళ్తాడు చోటు. నెక్ట్స్ సీన్ కోర్టులో చోటా వెయిట్ చేస్తుంటాడు. అక్కడేం చేస్తున్నావని పోలీసు పంపించేస్తాడు. కోర్టులో చోటా వెయిట్ చేస్తుంటాడు. రైజ్ దాదాను లేపెయ్యడానికి ప్లాన్ చేస్తారు. ఆ రోజు మొత్తం కోర్టులోనే ఉంటాడు. డ్రెస్ ఛేంజ్ చేసుకుంటాడు. నీటుగా టక్ చేసుకొని లాయర్ లా రెడీ అయి నడుచుకుంటూ వెళ్లి కోర్టు హాలులో కూర్చుంటాడు. అక్కడికి రైజ్ దాదాను తీసుకొని మల్లిక్ వస్తాడు. తీరా చూస్తే రైజ్ దాదాపు ఆ హాలుకు కాకుండా వేరే హాలుకు తీసుకెళ్తాడు. అది గమనించి చోట బయటకు వస్తాడు. అంతలో వారు చోటాకు కనిపిస్తారు. అది చూసి చోటా కాల్పులు జరుపుతాడు. అది ఎన్ కౌంటర్ అనుకొని రైజ్ దాదా పారిపోతాడు. అదే సమయంలో చోటా రైజ్ దాదాను చంపేస్తాడు. లాయర్ కోర్టు వేసుకొని చోటా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో పఠాన్, హరున్ ఇద్దరు మిగిలారు అని హబీబా మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడికి మల్లిక్ వస్తాడు. ఎందుకు చేశావు అని అరిచి వెళ్తాడు. నెక్ట్స్ సీన్లో చోటా పనిచేస్తున్న దగ్గరకి ధారా వెల్లి డబ్బు ఇచ్చి తనను మెచ్చకొని వెళ్తాడు.
మరో సీన్లో పఠాన్ తో రాజీ పడమని హాజీ చెప్తాడు. ఇంకా పఠాన్ బతికే ఉన్నాడని అంటాడు. మరో సీన్లో అమ్మ రిజల్ట్ వచ్చిందని వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని చెప్తుంది. దాంతో అజ్జు నేను అమ్మాను చూసుకుంటా అని చెప్తాడు. తరువాత అమ్మతో దుబాయ్ వెళ్తున్నట్లు ధారా చెప్తాడు. రేపు ఆసుపత్రికి వెళ్లాలని చెప్తాడు. నేను త్వరగానే బాగవుతానిని సకీనా చెప్తుంది. తరువాత సీన్లో ధారా సిగరేట్ తాగుతూ ఆలోచిస్తుంటాడు. డ్రగ్స్ తీసుకుంటుంన్న పఠాన్ కు ఫోన్ వస్తుంది. రేపు ఆసుపత్రిలో ధారా కుటుంబాన్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు పఠాన్. కట్ చేస్తే ఇస్మయిల్ తన ఫ్యామిలతో ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అక్కడ ధారా మనుషులు కాపాలాగా ఉంటారు. చెక్ చేసిన డాక్టర్ రిపోటర్ట్ లో బ్లాకేజ్ ఉందని విలైనంత త్వరగా సర్జరీ చేసుకోవాలని చెప్తుండగా గన్స్ సౌండ్ వస్తుంది. రెండు గ్యాంగ్ లు తీవ్రంగా కాల్చుకుంటారు. అదే ఘటనలో అజ్జుకు గాయం అవుతుంది. ఆసుపత్రిలో హబీబా కూడా ఫైరింగ్ చేస్తుంది. ఇక ఇస్మయిల్ కూడా గన్ తీసుకొని బిలావల్ ను కాల్చేస్తాడు. ఆసుపత్రికి ధారా వస్తాడు. తండ్రిని ఎలా ఉన్నావు అడుగుతాడు. సకీనా, అజ్జులకు ఎమన్నా అయితే ఈ సారి శత్రువలు కాదు నేనే చంపేస్తా అని ధారాతో ఇస్మయిల్ అంటాడు. ధారా అజ్జును పరామర్శించి పఠాన్ ను చంపడానికి వెళ్తారు. తను ఎక్కడున్నాడో చోటాకు తెలుసు అని చెప్పడంతో అతన్ని కూడా తీసుకొని వెళ్లి పఠాన్ ను చంపేస్తాడు. అలా పఠాన్ మనుషులందరిని చంపేస్తాడు ధారా. అది మీడియా మొత్తం ధారాను డాన్ గా, బాంబేలో శాంతీభద్రతలకు ధారా అడ్డు వస్తున్నాడని పేపర్లు రాస్తాయి. దాంతో ధారాను పట్టుకోవాడానిక మల్లిక్ వస్తాడు. అదే విషయాన్ని అబ్దుల్లాకు చెప్తాడు. దాంతో ప్లైన్ రెడీగా ఉందని వెంటనే బయలుదేరాలి అని అబ్దుల్లా చెప్తాడు. అబ్బు రానంటున్నాడని హబీబా చెప్తుంది. దాంతో వెళ్లేవాళ్లు వెళ్లిపోండి అంటాడు ఇస్మియిల్. దాంతో ధారా రమ్మని అడుగుతుండడంతో ఇస్మయిల్ గన్ తీసుకొని తలకు గురి పెట్టుకుంటాడు. ఇక్కడి నుంచి పారిపోతే జీవితాంతం పారిపోతునే ఉంటావు అని ఇస్మయిల్ అంటాడు. ఇక్కడే ఆగిపోతే కథ ఇక్కడే ముగుస్తుంది అని అమ్మాను పిలుస్తాడు ధారా. తాను కూడా రాదు. హబీబా కూడా రాను అంటుంది. ధారా, అజ్జు, హబీబా ఎయిర్ పోర్ట్ కు వెళ్తారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ధారా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో హాజీ కలుస్తాడు. ఇళ్లంత పోలీసులు సెర్చ్ చేస్తారు. హబీబా నువ్వు ఎందుకు వెళ్లలేదు అని మల్లిక్ అడగ్గా.. హరున్ ఇంకా బతికే ఉన్నాడు సార్ అని చెప్పి కుర్చిలో కూర్చుంటుంది. అది చూసిన ఇస్మయిల్ చెడు కూడా మంచి నుంచే పుడుతుంది. సైతాన్ ను కూడా అల్లానే సృష్టించాడు నేనూ కేవలం తండ్రిని అనుకుంటాడు. కట్ చేస్తే గుజరాత్ లో హారున్ సముద్రం ఒడ్డున నడుచుకుంటు వెళ్తాడు. చోటుకు టీ చెప్పి తాను వాష్ రూమ్ కు వెళ్తాడు. అక్కడి టీ తెచ్చిన అబ్బాయి హరున్ ను గన్ తో కాల్చేస్తాడు. హరున్ చనిపోయిన విషయాన్ని ధార మనుషలు హబీబాకు చెప్తారు. హబీబా చిన్నగా నవ్వుతుంది. నేరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దేవుడికి మనిషికి మధ్య, రెండవది మనిషికి మనిషికి మధ్య, దేవుడు మనిషినకి క్షమిస్తాడు. కాని మనిషి దేవుడు కాదు క్షమించడు. అనే వాయిస్ ఓవర్ తో కథ అయిపోతుంది.
చదవండి:Premam director: సినిమాల నుంచి తప్పుకున్న హిట్ మూవీ డైరెక్టర్..?