The Railway Men: డిసెంబర్ 3, 1984 భూపాల్ లోని యూనియన్ కార్బేడ్ కెమికల్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ లీక్ అయిన రోజ, ఈ ఘటనలో దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమ దుర్ఘటన అనే టైటిల్స్ తో సిరీస్ మొదలౌతుంది. ఆ ఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్స్, పోలీసు డిస్కషన్స్ తో యూనియన్ కార్బైడ్ బయట జర్నలిస్టులు, పోలీసులు ఉంటారు. మహాత్ముని ప్రాణాలు తీసిన గాడ్సెకు ఉరిశిక్ష పడింది. ఎందుకంటే ఆయన మహాత్ముడు, కాని 15000 వేల మంది మరణానికి కారణం అయిన చీఫ్ మాత్రం అరెస్ట్ అయి వెంటనే రిలీజ్ అయ్యాడు. ఈ దేశంలో గుప్పెడు ఉప్పుకన్న చౌకగా సామాన్యుడి జీవితం దొరుకుతుంది అని రిపోర్ట్ కుమావత్ వాయిస్ ఓవర్ వస్తుంది. తరువాత చీఫ్.. ప్లేన్ లో వెళ్లిపోతాడు. జర్నలిస్టులు ఫోటోలు తీస్తారు. ప్రాణాలు తీసేవాడికి శిక్ష, కాపాడిని వాడికి ప్రశంస ఈ రెండు మన దేశంలో లభించవు అని వాయిస్ ఓవర్ వస్తుంది. టైటిల్స్ పడుతాయి.
చదవండి:Eagle Trailer: రవితేజ ఈగల్ ట్రైలర్… విధ్వంసం
ఓపెన్ చేస్తే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. ఒక పిల్లోడు వంతెన నుంచి కింద పడుతాడు. దాన్ని స్టేషన్ మాస్టర్ కలగంటాడు. డిసెంబర్ 2 అని టైటిల్ పడుతుంది. అక్కడే ఉన్న తన కూతురు గుడ్ మార్నింగ్ చెబుతుంది. గ్యాస్ లీక్ కు 16 గంటల ముందు. స్టేషన్ మాస్టర్ డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతాడు. అతని కొడుకు రాజీవ్ గాంధీ స్పీచ్ వింటూ సిక్కుల గురించి మాట్లాడుతాడు. బయట ఉన్న మాస్టర్ ఉద్యోగం గురించి అడిగితే తానకు యూనియన్ కార్బైడ్ లో ఇంటర్వూ ఉందని చెప్తాడు. యాసిడ్ కంపెనీలో పనిచేస్తావా అంటూ ఎస్ఎమ్ కోప్పడి వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో కంపెనీలో గ్యాస్ లీక్ అవుతుందని అందరు హాడావిడీ చేస్తుంటారు. అక్కడి వచ్చిన ఆఫీసర్ కమ్రుద్దిన్ ఎమ్ఐఎస్ ట్యాంక్ వేడిగా ఉందా అని చెక్ చేస్తాడు. అది చల్లగానే ఉందని ఊపిరి పీల్చుకుంటాడు. అక్కడికి కంపెనీ ఎండీ మ్యాడ్ సన్ వచ్చి అందరూ పని చూసుకోండి కొప్పడుతాడు. తరువాత గ్యాస్ లీక్ అవడానికి 15 గంటల ముందు ఫ్యాక్టరీలో వాడే మిథైల్ ఐసోసైనేట్ గురించి అడిగి రికార్డు చేసుకుంటాడు రిపోర్టర్ కుమావత్. తన పేరు హిమాది రియాజ్ అని, తాను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఇది వరకు ట్రక్ డ్రైవర్ గా పని చేసినట్లు చెప్తాడు. అక్కడ పురుగుల మందు తయారు చేస్తారని, అది మరింత ఎఫెక్ట్ గా పనిచేయడానికి ఎమ్ఐసీ… మిథైల్ ఐసోసైనేట్ వాడుతున్నారని.. అది చాలా ప్రమాదకరమైన మిశ్రమం అని చెప్తాడు. దీన్ని లిక్విడ్ డైనమెట్ అని పిలిచేవారని.. నీటితో కలిస్తే విషంగా మారుతుందని, అప్పుడు వెలువడే గ్యాస్ పీలిస్తే మనుషులు చనిపోతావరు అని చెప్తాడు. దాన్ని ట్రక్కుల్లో తీసుకెళ్తున్నప్పుడ ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తగా మాస్కులు అడిగినందుకు తనను పనిలోంచి తీసేసినట్లు చెప్తాడు హిమాది రియాజ్.
నెక్ట్స్ సీన్లో కంపెని ఎండీ మ్యాడ్ సన్ తో కంపెనీ వర్కర్లకు సేఫ్టీ థింగ్స్ ఇవ్వాలని, ఎమ్ఐసీ ట్యాంకర్లపై ఒక్క చుక్క నీరు పడినా విద్వంసం జరుగుతుందని కమ్రుద్దిన్ చెప్పడంతో మ్యాడ్ సన్ కు కోపం వస్తుంది. కంపెనీ నష్టాల్లో నడుస్తుందని, దానికి తోడు పరిశ్రమ గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని కుమావత్ రాసిన పేపర్ ను చూసిప్తాడు. తరువాత సీన్లో హిమాది రియాజ్ కు ముగ్గరి ఫోటో చూపించి వీరిని గుర్తు పట్టగలవా అంటే వారు సేఫ్టీ చెకింగ్ చేయడానికి విదేశాల నుంచి వాచ్చారు అని చెప్తాడు. ఆ తరువాత కూడా సేఫ్టీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్తాడు. ఒకసారి గ్యాస్ లీక్ అయి మహ్మాద్ అన్సారీ అనే కార్మికుడు చనిపోయినట్లు చెప్తాడు. అతడు తన ఫ్రెండే అని బాధపడుతాడు. ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పమని కుమావత్ అడుగుతాడు. ఆ రోజు ఉడికిన క్యాబేజీ వాసన ఎమ్ఐసీ నుంచి ఫ్యాక్టరీ అంతా వ్యాపించిందని, ఆ సమయంలో లీకేజ్ ని రిపైర్ చేయడానికి అన్సారీ వెళ్లి చనిపోయాడు అని ఎమోషనల్ అవుతూ చెప్తాడు.
తరువాత సీన్లో స్టేషన్ మాస్టర్(ఎస్ఎమ్) రైల్వే స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ బెగ్గింగ్ చేసే పిల్లలు అతన్ని చూసి పరుగెడుతారు. నైట్ డ్యూటీ కదా అని ప్రసాద్ వచ్చి అడుగుతే.. స్టేషన్లో పాడైన ఫోన్ గురించి అడిగి దాన్ని తీసుకెళ్లి చెక్ చేస్తాడు. ఎస్ఎమ్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, పని ఆపేసి తాగుతున్న వారిని వెంటనే పనిలోంచి తీసేస్తాడు. తరువాత సీన్లో కుమావత్ తో హిమాది రియాజ్ కేసు గురించి మాట్లాడుతాడు. తరువాత ఫస్ట్ డే స్టేషన్ కు లేట్ అవకూడదు అని కుమావత్ చెప్తాడు. కట్ చేస్తే హిమాది రియాజ్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఎమ్ ను కలుస్తాడు. స్టేషన్లో పనిచేయనిది ఒకటి ఉందని అది కనిపెట్టమని చెప్పి పది నిమిషాలు టైమ్ ఇస్తాడు. హిమాది రియాజ్ దానికోసం వెతుకుతుంటాడు. అంతలో స్టేషన్లో పనిచేసే విజయతో, తన కూతురి పెళ్లి గురించి ఎస్ఎమ్ మాట్లాడుతుంటాడు. హిమాది రియాజ్ పరుగెత్తుకుంటూ వచ్చి కమ్యూనికేషన్ పనిచేయడం లేదని చెప్తాడు. ఎలా కనిపెట్టావు అంటే మీ టైబుల్ పైన ఫోన్ ఉందని, స్టేషన్ మాస్టర్ కు ఫోన్ తో ఏం పని అని అంటాడు. దాంతో ఎస్ఎమ్ ఇంప్రెస్ అవుతాడు. పనిలో జాయిన్ అవమంటాడు. ఇంకోటి కూడా పనిచేయట్లేదు. స్టేషన్లో గడీయారం రెండు నిమిషాలు ఫాస్ట్ గా వెళ్తుంది అని హిమాద్రీయాజ్ చెప్తాడు. తరువాత అతన్ని చూస్తూ టైమ్ సరి చేస్తాడు ఎస్ఎమ్.
గ్యాస్ లీక్ అవడానికి 13 గంటల ముందు అనే టైటిల్ పడుతుంది. ఎంపీ మీద దాడిచేసినవాడు, అనేక దొంగతనాలు చేసిన ఒక నేరస్తుడి గురించి పోలీసులు వెతుకున్నారని చెప్తుండగా అతడు వచ్చి బూట్ పాలీష్ చేసుకుంటాడు. అదే సమయంలో మరో వ్యక్తి సూట్ కేసుతో స్టేషన్ కు వస్తాడు. అతను గబ్బర్.. అయితే స్టేషన్లో తనకు చాలా మంది హెల్ప్ చేస్తుంటారు. అతని దగ్గర సూట్ కేసు కొట్టేద్దామని అనుకుంటాడు కాని పోలీసులు మఫ్టీలో ఉన్నారని తెలిసి ఒక అతన్ని కొట్టి అక్కడినుంచి పారిపోతాడు. కట్ చేస్తే అతను పోలీసు డ్రెస్ వేసుకొని అకౌంటెంట్ తో మాట్లాడుతాడు. తనతో వాష్ రూమ్ లో మాట్లాడుతూ ఏదైనా పెద్దది కొట్టేయ్యాలి ఏ ట్రైన్ లో ఎంత సొమ్ము వెళ్తుందో అని అతని దగ్గర ఉన్న అకౌంట్స్ బుక్ లో చెక్ చేసి, భోపాల్ స్టేషన్లో ఎక్కువ మొత్తంలో ఉందని ఆలోచిస్తుంటాడు.
గ్యాస్ లీస్ అవడానికి 4 గంటల ముందు.. హిమాద్రీకి ట్రంక్ కాల్ వస్తే మాట్లాడుతాడు. ఫ్యాక్టరీలో చనిపోయిన తన ఫ్రెండ్ అన్సారీ వైఫ్ ఫోన్ చేస్తుంది. కేసుగురించి, వచ్చే నష్టపరిహారం గురించి మాట్లాడుతుంది. తరువాత కమ్రుద్దిన్ సర్ వారికి న్యాయం చేస్తాడు కదా అని అతని భార్య నఫీసాను అడుగుతాడు. దాంతో హిమద్రీని తనను లోపలికి రా అని మాస్క్ చూపిస్తుంది. ముందు జాగ్రత్తగా కమ్రుద్దిన్ మాస్క్ ఇచ్చాడని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తుంది. తరువాత సీన్లో నైట్ షిఫ్ట్ వాళ్లు వచ్చారని కమ్రుద్దీన్ తో చెప్తారు. వెంటనే కమ్రుద్దీన్ ఎమ్ఐఎస్ గురించి కంపెనీలో ఉన్న రిపోర్ట్స్ చూస్తాడు. తరువాత కుమావత్ కు ఫోన్ చేసి రిపోర్ట్స్ తన దగ్గరే ఉన్నాయని, దీని గురించి వీరికి రెండేళ్ల కిందనే తెలుసు అని చెప్తాడు. మా ఇంటి దగ్గరకు వచ్చేయ్ రిపోర్ట్ ఇస్తా అని చెప్తాడు. తరువాత ఫ్యాక్టరీలో పని మొదలు పెడుతారు.
లీక్ అవడానికి 3 గంటల ముందు.. ఎస్ఎమ్ విజయ ఇంటికి వెళుతాడు. అక్కడ పెళ్లి కూతురుతో మాట్లాడుతాడు. తన ఐఏఎస్ అఫీసర్ అవ్వాలని ఆశీర్వదించి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో హిమాద్రీయాజ్ వర్క్ షాప్ కు వెళ్తాడు. అక్కడ ట్రైన్ పెట్టెలు తయారు అవుతాయి. హిమాద్రీని పెలిచి నీకు ఎమొచ్చో చూపించమని చెప్తాడు. తరువాత వర్క్ షాప్లో గమనించమని చెప్తాడు సూపర్ వైజర్. తరువాత సీన్లో పరిశ్రమలో వాటర్ కారుతున్నట్లు కంప్లైంట్ వస్తే అది చెక్ చేస్తారు. పైపులు కడుగుతుంటారు. మరో సీన్లో ఎస్ఎమ్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ మఫ్టీలో ఉన్న గబ్బర్ ఆర్ఫీఎఫ్ పోలీసులతో గొడువ పడుతుంటాడు. అక్కడికి ఎస్ఎమ్ వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతే.. ఆర్పీఎఫ్ ఖజానాను కాజేయడానికి ఆ గబ్బర్ ఇక్కడికి వచ్చాడు అని ఎస్ఎమ్ తో చెప్తాడు గబ్బర్. సరే అని మీరు టీ తాగి రండి అని ఆ డబ్బును సర్ధుతుంటారు. దాన్ని గబ్బర్ చూస్తాడు. తరువాత ఆర్పీఎఫ్ హెడ్ వస్తున్నాడని, నాకు చెప్పిందే అతనితో చెప్పమని ఎస్ఎమ్ గబ్బర్ ను ఆఫీస్ లో కూర్చొబెడుతాడు. అదే సమయంలో కమ్యూనికేషన్ రిపైర్ చేస్తుంటారు.
తరువాత సీన్లో ఫ్యాక్టరీలో సౌండ్ వస్తుంది దాసు బాబు మీటర్స్ చూస్తుంటాడు. ఏదో వాసన వస్తుందని క్యాంటీన్ లో మాట్లాడుకుంటారు. అక్కడ ఏం జరుగుతుంది అని వైర్లెస్ కాల్ చేస్తాడు దాసు బాబు. ఎవరు రెస్పాండ్ అవరు. దాంతో ఎమ్ఐసీ ట్యాంక్ ను చెక్ చేస్తే అది వేడిగా ఉంటుంది. అదే సమయంలో కమ్రుద్దిన్ ఇంటికి వెళ్తుంటే సెక్యూరిటీ ఫోన్ చేస్తాడు. ఫ్యాక్టరీ నుంచి పోగ బయటకు వస్తుంది. వెంటనే కమ్రుద్దిన్ పరుగెత్తుకుంటు వెళ్తాడు. టెంపరేచర్ పెరిగిపోతుంది. వెంటనే గ్యాస్ లీక్ అవడం మొదలు అవుతుంది. ఇక నీళ్లు వెళితే పెద్ద ప్రమాదం జరుగుతుందని వర్కర్లను బయటకు పంపమని చెప్తాడు. అందరూ పరుగెత్తుతారు. గ్యాస్ పీల్చి కొందరు కిందపడుతుంటారు. అదే సమయంలో దాసు, కమ్రుద్దిన్ వాటర్ ను ఆపాలని చూస్తారు. దాసును కూడా వెళ్లమని ఎమ్ఐఎస్ ట్యాంక్ పైకి ఎక్కి అడ్జెస్ట్ చేస్తుంటాడు కమ్రుద్దిన్, అప్పటికే తనకు కూడా ఊపిరి ఆడదు. అంతలో ట్యాంక్ పేలి ఎమ్ఐఎస్ గ్యాస్ లీక్ అవుతుంది. కమ్రుద్దిన్ చనిపోతాడు. విజయ కూతురి పెళ్లిలో బంధువులు సందడి చేస్తుంటారు. ఎస్ఎమ్ స్టేషన్లో ఉంటాడు. అన్సారీ వైఫ్ ట్రైన్ లో ఉంటుంది. తరువాత గ్యాస్ లీక్ అవడానికి 14 నెలల ముందు అనే టైటిల్ పడుతుంది.
అన్సారీ డెడ్ బాడీ పోస్ట్ మర్టమ్ కు తీసుకెళ్తారు. తన వైఫ్ అన్సారీ మరణం గురించి చెప్తుంది. ఇంటికి వచ్చి రక్తం కక్కాడు అని హిమాది రియాజ్ తో చెప్తుంది. కంపెనీవాళ్లు ఏమన్నారు అంటే డబ్బులు ఇచ్చారు అని చెప్తుంది. తరువాత పోస్ట్ మర్టం చేసిన డాక్టర్లు అన్సారీ ఊపిరితిత్తులను బయటకు తీసి ఇందులో హైడ్రోజన్ సైనెడ్ ఉందని చెప్తారు. అతనికి న్యాయం చేస్తా అని హిమాద్రీయాజ్ చెప్తాడు. తరువాత రైల్వేలో ఇన్సిపెక్షన్ కోసం రతి పాండే వస్తున్నాడని వినోద్ తో చెప్తాడు. అందరూ అతను చాలా స్ట్రిక్ట్ అని మాట్లాడుకుంటారు. అతను ఎక్కడున్నాడో కనిపెట్టమని వినోద్ చెప్తాడు. తరువాత సీన్లో అన్సారీ వైఫ్ ట్రైన్లో వస్తుంటారు. వాళ్లతో పాటే మరో సిక్కు ఫ్యామిలీ ఉంటుంది. అదే సమయంలో సిక్కులు ఇందిర గాంధీని చంపేశారని, సిక్కులను చంపేయ్యాలని కొందరు ప్రయాణికులు మాట్లాడుకుంటారు. అక్కడికి టీసీ వచ్చి వారిని తిట్టి.. వెళ్లి పడుకోండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న సిక్కులు ఇద్దరు ఆడవాళ్లు, తల్లి కూతురు బయపడుతారు. వారి దగ్గరకు పక్కనే కత్తి ఉంటుంది. అది చూసి టీసీ సైలెంట్ గా వెళ్లిపోతాడు.
తరువాత హిమాద్రి వర్క్ షాప్ లో పని అయిపోయిందని మాట్లాడుకుంటారు. అదే సమయంలో బయటకు వెళ్తా అని సూపరవ్ వైజర్ టార్చ్ పట్టుకొని వెళ్తాడు. గ్యాస్ వలన అతను దగ్గుతూ ఒక రూమ్ లోకి వెళ్తాడు. తరువాత స్టేషన్ కు విజయ వచ్చి, భోజనాలకు డబ్బులు తక్కువ అయ్యాయి అని మాస్టర్ అడిగి డబ్బు తీసుకెళ్తుంది. అదే సమయంలో స్టేషన్లో అందరూ కింద పడిపోతుంటారు. గ్యాస్ లీక్ అవడం వలన వీధిలో అందరు పడిపోతుంటారు. బయటకు వెళ్లిన సూపర్ వైజరర్ కిందపడిపోతాడు. అది చూసి హిమాద్రి అనుమాన పడి వెంటనే క్లాత్ ముక్కుకు కట్టుకొని బయటకు వచ్చి చూస్తే అతను చనిపోతాడు. తరువాత ఫ్యాక్టరీలో అందరు కిందపడిపోతారు. డబ్బులు తీసుకొస్తున్న విజయ పడిపోతుంది. ఎస్ఎమ్ కుటుంబం బైక్ పై మాస్కులు కట్టుకొని వెళ్తారు. తరువాత స్టేషన్లో చైల్డ్ బెగ్గర్ చనిపోతాడు. అతన్ని పట్టుకొని వాళ్ల అన్న ఏడుస్తాడు. అది చూసి ఎస్ఎమ్ బయటకు వస్తాడు. అందరూ కిందపడిపోతూ ఉంటారు. వారిని కాపాడడానికి గబ్బర్, స్టేషన్ మాస్టర్ ట్రై చేస్తారు. తరువాత గాల్లో ఏదో ఉందని దుర్వాసన వస్తుందని ఎస్ఎమ్ చెప్తాడు. తరువాత అందరు వైయిటింగ్ రూమ్ లో ఉండమని చెప్తాడు.
మరో సీన్లో కుమావత్ పోలీసుతో మాట్లాడుతుంటాడు. ఫ్యాక్టరీ గురించి రాయొద్దు అని బెదిరిస్తాడు పోలీసు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అంతలో ఎమర్జెన్సీ, భోపాల్ రెడ్ జోన్ అని రేడియోలో చెప్తుంటారు. పోలీసులు బయలుదేరుతారు. అదే సమయంలో కుమావత్ బయటకు వస్తాడు. తరువాత సీన్లో ఫ్యాక్టరీలో మ్యాడ్ సన్ తన మనుషితో కలిసి ట్యాంక్ పేలిన దగ్గర చూస్తారు. కమ్రుద్దిన్ త్యాగం చేయకపోతే చాలా పెద్ద నష్టం జరిగేదని, కేవలం ఒక ట్యాంక్ మాత్రమే పేలిందని, కమ్రుద్దిన్ కు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఆ తరువాత అందరితో మీటింగ్ పెట్టి పోలీసులు, జర్నలిస్టులు ఎవరు లోపలికి రావద్దని చెప్తాడు. మరో సీన్లో కుమావత్ బయటకు వచ్చి చూస్తాడు. ఒక ఎద్దుల బండి పరుగెత్తుకుంటూ వస్తుంది అందులో మనిషి చనిపోయి ఉంటాడు. తరువాత స్టేషన్లో అందరూ వెయిటింగ్ రూమ్ లో ఉంటారు. అక్కడ ఒక అవిడ చనిపోతుంది. ఆమెను కాపాడడానికి సీఆర్పీ చేసి డాక్టర్ కూడా చనిపోతాడు. తరువాత విజయ చనిపోతుంది. అదే సమయంలో అక్కడికి హిమాద్రీయాజ్ రిపైర్ చేస్తున్న ట్రైన్ లో వస్తాడు. అదే సమయంలో చాలా మంది బయటకు వెళ్లడానికి ట్రై చేస్తారు. ఎస్ఎమ్ వద్దన్నా వినకుండా ఇద్దరు బయటకు వెళ్తారు. బయటకు వెళ్లి చనిపోతారు. అది చూసి మిగితా వారు బయపడుతారు. హిమాద్రీ సైగ చేస్తే ఎప్ఎమ్ కర్చిఫ్ కట్టుకొని వెళ్లి మరో వ్యక్తిని తీసుకొస్తారు. వీళ్లను కాపాడాల్సిన బాధ్యత నీదే అని హిమాద్రిని ఎస్ఎమ్ కోరుతాడు. అందరిని తడిపిన క్లాత్ మూతికి కట్టుకోమని చెప్తాడు.
మరోవైపు ట్రైన్లో సిక్కుల కోసం కొంతమంది గుండాలు వెతుకుతుంటారు. అందులో ఉన్న సిక్కుల ఫ్యామిలీ భయపడుతుంటారు. అందరి పేర్లు అడుగుతుంటారు. అదే సమయంలో వారిని అన్సారీ భార్య తమ చుట్టాలు అని చెప్పి కాపాడుతుంది. తరువాత టీసీ వారిని తీసుకొని ఒక గదిలోకి పంపిస్తాడు. మరో సీన్లో హిమాద్రి ట్రైన్ వేసుకొని మరో స్టేషన్ దగ్గర చూసివస్తాడు. అదే సమయంలో వెయిటింగ్ హాల్ లో ఉన్న వాళ్లు నీళ్లకోసం గొడవ పడి కుండను కిందపడేస్తారు. ఎస్ఎమ్ వెంటనే పరుగెత్తుకుంటు వెళ్లి మూడు కూజాలు తీసుకొస్తాడు. తరువాత హిమాద్రి వస్తాడు. అతనితో మాట్లాడితే అందరు చనిపోయారు అని చెప్తాడు. ఇక కమ్యూనికేషన్ ఇంకా కలువలేదని దానికోసం ఎస్ఎమ్ ట్రై చేస్తాడు. అదే సమయంలో భోపాల్ జంక్షన్ కోసం ట్రై చేస్తే వారికి ఎలాంటి ఇన్ఫార్మెషన్ లేదని హిటాచీ స్టేషన్ లో పనిచేసే అధికారి చెప్తాడు అదే సమయంలో ఎస్ఎమ్ ట్రై చేస్తాడు కలువదు. తరువాత సీన్లో రతి పాండే వారితో మాట్లాడి పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాడు. భోపాల్ పరిస్థితి విషమంగా ఉందని, చాలా మంది కింద పడిపోతున్నారని వారికి ఎమర్జెన్సీ మెడికల్ కావాలని తెలుసకుంటాడు. తరువాత ట్రైన్ ఆపడానికి ట్రై చేస్తే అది ఆగదు. మరో వైపు అదే ట్రైన్లో సిక్కుల కోసం వెతుకుతున్న వారు డోర్ ను కొడుతుంటారు. తల్లిచనిపోతుంది. కాని బిడ్డ పాలు తాగుతూనే ఉంటుంది.
అమెరికాలో 1970 రిసెర్చ్ ల్యాబ్ లో హైడ్రోజన్ సైనెడ్ పై సైంటిస్త్ ప్రయోగం చేస్తుంటాడు. అది హెవీ హీట్ అయి పగిలిపోతుంది. వెంటనే ఇది చాలా ప్రమాదకరమైనది అని సైంటిస్ట్ ఆపేయ్యాలని చెప్తాడు. మరో సైంటిస్ట్ అది వినడు. తరువాత ఢిల్లీలో ఉన్న రాజేశ్వరి జాంగ్లికి రతి పాండే ఫోన్ చేసి హెల్ప్ చేయమని చెప్తాడు. వీరిద్దరు భార్య భర్తలు చిన్న మనస్పర్థలు వస్తాయి. ముందు ఒప్పుకోదు తరువాత పరిస్థితి అర్థం చేసుకొని ఆమె ఒప్పుకుంటుంది. తరువాత పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇక ఇటాచి స్టేషన్లో ఉన్న అందరు పోలీసుల, మెడికల్ సిబ్బంది అటెండ్ కావాలని రతి పాండే చెప్తాడు. తరువాత ట్రైన్ లో సిక్కుల గురించి రౌడీలు అల్లరి చేస్తరు. డోర్లు పగులగొడుతారు. లోపలి ఉన్నది అమ్మాయి అను కొని బట్టలు చించేస్తారు. తను మగవాడు అని తెలసి చంపబోతారు. అదే సమయంలో తన దగ్గర ఉన్న కత్తితో పొడుస్తుంది తన తల్లి. స్టేషన్ మాస్టర్ చైన్ లాగి వారిని తీసుకొని ఇంజన్ వద్దకు తీసుకెళ్తాడు.
నెక్ట్స్ సీన్లో స్టేషన్ వెయిటింగ్ రూమ్ లో ఉన్న వారు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు. తరువాత వారిదగ్గర ఒక బోగీ ఉంది అని దాన్ని తీసుకురావడానికి గబ్బర్ కు వాకీటాకీ ఇచ్చి హిమాద్రి, మాస్టర్ వెళ్తారు. తరువాత ఏదో పని ఉందని దొంగ కూడా బయటకు వెళ్తాడు. మరో సీన్లో రాజేశ్వరీ రైల్వేస్ తో మాట్లాడుతుంది. భోపాల్ కు ట్రైన్ పంపడం కాని, హెల్పర్స్ ను పంపడం కుదరదు అని చెప్పేస్తారు. ఇదే విషయాన్ని రతి పాండేకు చెబుతుంది. తరువాత పూర్తిగా ఛార్జ్ తీసుకొమ్మని చెబుతుంది. వెంటనే అందరిని అసెంబెల్ చేసి భోపాల్ వాసులకు సాయం చేయడానికి వెళ్దాం అని చెప్తాడు. అందరూ కాసేపు ఆలోచించుకొని ట్రైన్ ఎక్కుతారు. అందరు బయలుదేరుతారు.
మరో సీన్లో ట్రైన్ మాస్టర్ గుండాలను దారి మళ్లిస్తాడు. గన్ పేలుస్తూ వారిని ట్రైన్ నుంచి దూరం తీసుకెళ్తాడు. గన్ పేలుస్తాడు. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మాస్టర్ పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కుతాడు. అతన్ని ఒక గుండా కత్తితో పొడుస్తాడు. తరువాత సీన్లో ఇండస్ట్రికి డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ఫోన్ చేసి, గ్యాస్ లీకేజ్ గురించి మాట్లాడితే.. అలాంటిది ఏం లేదని మ్యాడ్ సన్ అబద్దం చెప్తాడు. తరువాత కుమావత్, కమ్రుద్దిన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ పేపర్స్ గురించి వెతుకుతాడు. అదే సమయంలో విజయ కుతురుకు మెలుకువ వస్తుంది. లేచి అటు ఇటూ చూస్తుంది. గర్భంతో ఉన్న హప్సినా మాస్కు ధరించి నడుచుకుంటూ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తుంది. తన భర్త స్కూటర్ ను చూస్తుంది. ఫ్యాక్టరీ లాక్ వేసి ఉంటుంది. గేట్ ను లాగుతుంది. అదే రోడ్డులో వస్తున్న కుమావత్ కు కారు ఎదురుగా వస్తుండడంతో కిందపడిపోతాడు. అక్కడే హప్సినా ఇబ్బంది పడుతుంది. వెంటనే తన పరిస్థితిని చూసి స్కూటర్లో ఆసుపత్రికి తీసుకెళ్తాడు.
నెక్ట్స్ సీన్లో ఎమ్ఐసీ గ్యాస్ గురించి స్టడీ చేసిన ఒక పర్సన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఫోన్ చేస్తాడు. భోపాల్ జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటాడు. తరువాత సీన్లో భోపాల్ స్టేషన్లో గబ్బర్ ఎస్ఎమ్ రూమ్ లో ఇనుపపెట్టేను తెరిచేందుకు ట్రై చేస్తాడు. అక్కడికి ప్రసాద్ వచ్చి అతనితో గొడువ పడుతాడు. తరువాత హిమాద్రి, ఎస్ఎమ్ ట్రైన్ తీసుకొస్తారు. నెక్ట్స్ రాజేశ్వరీ పీఎమ్ఓ ఆఫీస్ లో మాట్లాడుతుంది. అక్కడ అసిస్టెంట్ ప్రొఫేసర్ కూడా ఉంటారు. భోపాల్ ఘటన విషయంలో పీఎమ్ఓ ఏ హెల్ప్ చేయదు అని ఆఫీసర్ చెప్తాడు. తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ… దానికి యాంటిడోస్ తనకు తెలుసని చెప్తాడు. తరువాతసీన్లో కుమావత్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని, హప్సీనా రిపోర్ట్ కోసం స్కూటర్ వెతుకుతుంటే అందులో ఎమ్ఐఎస్ రిపోర్ట్స్ దొరుకుతాయి.
తరువాత స్టేషన్లో ప్రసాద్, గబ్బర్ గొడవ పడుతుంటారు. అదే సమయంలో ట్రైన్ వస్తుంది. అందరిని అందులో ఎక్కిస్తారు. రతి పాండే ట్రైన్ స్పీడ్ గా వస్తుంది. అదే సమయంలో హిమాద్రి టైన్ స్టార్ట్ అవదు. తరువాత కుమావత్ 1996లో ఫోటోలను తీస్తుంటాడు. హప్సీనా రిపోర్టర్ తో మాట్లాడుతుంది. తనకు హ్యండికాప్ కొడుకు ఉన్నాడని చెప్తుంది. తరువాత సీన్లో రాజేశ్వరి సీగరేట్ తాగుతుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి యాంటిడోస్ ఆపమని మనీ ఆఫర్ చేస్తాడు. తను రెజెక్ట్ చేస్తుంది. మరో సీన్లో యాంటిడోస్ ను పంపిస్తారు. తరువాత సీన్లో కుమావత్, మ్యాడ్ సన్ కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. దీనికి కారణం మీ నెగ్లిజెన్స్ అని చెప్తే.. మ్యాడ్ సన్ అసలు అలాంటివి ఏమి జరగలేదని, అలాంటి మెటిరియల్ లేదని చెప్తాడు. మరో సీన్లో పోలీసు పాట్రోల్ చేస్తుంటారు. హిటాచీ నుంచి రిలీఫ్ ట్రైన్ వస్తుందని అది అందరికి చెప్పాలి అని వారికి కాల్ వస్తుంది. అది చెప్పడానికి పోలీసులు వెళ్తుంటే యాక్సిడెంంట్ అవుతుంది. తరువాత సీన్లో ట్రైన్ ఎందుకు కదలడం లేదని లోపల ఉన్నవారు అరుస్తుంటారు. మనం దిగి వెళ్లిపోదామని గబ్బర్ అంటాడు. అదే సమయంలో ఎస్ఎమ్ తను కొన్ని సంవత్సరాల క్రితం ట్రైన్ యాక్సిడెంట్ గురించి చెప్తాడు. తాను ఒక బాబు ప్రాణాన్ని కాపాడలేకపోయాను అని అందుకోసం నిద్రలేని రాత్రులు గడిపాను అని, అలాంటిది ఇంతమందిని వదిలి వెల్లడం అంటే ప్రాణం పోయినట్లే అని చెప్తాడు.
అదే సమయంలో గోరకుపుర్ ఎక్స్ ప్రెస్ వస్తుంది. దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. దానికోసం ప్రసాద్ పట్టాలపై పేలుడు పదార్థాలు పెట్టి తన మాస్క్ ను తీసేసి చనిపోతాడు. అదే సమయంలో వచ్చిన ట్రైన్ అది గమనించి స్లో చేసుకుంటుంది. అందరిని ఆ ట్రైన్లో ఎక్కిస్తారు. అదే సమయంలో కొందరు ట్రైన్ దిగుతారు. వారిని ఎక్కిస్తారు. హిమాద్రీయాజ్ బంధువులు కూడా కిందికి దిగుతారు. ఎస్ఎమ్, దొంగ అందరిని ట్రైన్లోకి ఎక్కిస్తారు. అలా అందరిని ఎక్కిస్తుండగా స్టేషన్ బయటనుంచి చాలా మంది పరుగెత్తుకుంటు వస్తారు. వారందరూ యాత్రికులని అందరిని ట్రైన్లో ఎక్కిస్తారు. ఎస్ఎమ్ విజిల్ తీసుకొని ఊదుతూ అందరిని ట్రైన్లోకి ఎక్కిస్తాడు. అంతలో దొంగ ట్రైన్ ఎక్కుతాడు. హిటాచి నుంచి మరో రిలీఫ్ ట్రైన్ వస్తుందని తెలిసి ట్రైన్ దిగుతాడు. ఇదే విషయాన్ని హమాద్రీయాజ్ కు చెప్తాడు. రెండు ఒకే పట్టాలపై ఉన్నాయని, వాటిని వేరు చేయడానికి పట్టాలపై వెళ్లి చివరరి నిమిషయంలో లివర్ లాగుతాడు. ట్రైన్స్ రెండు సేఫ్. స్టేషన్లో సమిరా సృహ తప్పిపడిపోతుంది. అది చూసిన స్టేషన్ మాస్టర్ బాబును కాపాడలేకపోయింది గుర్తుకు వచ్చి పాపకు సీఆర్పీ చేసి బతికిస్తాడు. తరువాత అతను పడిపోతాడు.
అక్కడికి గబ్బర్ వచ్చి ఎస్ఎమ్ కు రిలీఫ్ ట్రైన్ వస్తున్న విషయం చెప్తాడు. అది విని సంతోషపడి కళ్లు మూస్తాడు. తరువాత జేబులోంచి తాళాలు తీసుకొని రూమ్ లోకి వెళ్తాడు గబ్బర్. రీలీఫ్ ట్రైన్ వస్తుంది. అందిరికి సాహాయం అందిస్తారు. అదే సమయంలో రాజేశ్వరితో తన పై ఆఫీసర్ రతిపాండేపై రరిపోర్ట్ రెడీ చేయి అని చెప్తాడు. అతను ప్రాణాలకు తెగించి కాపాడినందుకా అని సాయంత్రం లోపు నేనే రాజీనామా చేస్తా అని వెళ్లిపోతుంది. తరువాత స్టేషన్లో డబ్బులు పోయాయి అని పోలీసులు గుర్తిస్తారు. స్టేషన్ మాస్టర్ కొట్టేసి ఉంటాడని మాట్లాడుకుంటారు. ఇది గబ్బర్ వింటాడు. రతి పాండేను తీసుకొచ్చి డబ్బులు పోయినట్లు బీరువ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉంటాయి. తరువాత గబ్బర్ ఒక రూపాయి నోటు చేతులో పట్టుకొని యాపిల్ ఇస్తే తీసుకుంటాడు. అదే సమయంలో స్టేషన్ మాస్టర్ కోసం వాళ్ల కొడుకు వస్తాడు. అడిగితే అక్కడ లేడు అని చెప్తాడు. దాంతో శ్మాశాన వాటికకు వెళ్లి వెతుకుతాడు. అక్కడ కూడా దొరకడు. మరో వైపు అక్కడున్న సిబ్బంది కాల్చడానికి ఎస్ఎమ్ ను పట్టుకుంటే ఉలిక్కిపడి లేచి అందరు మాస్కులు పెట్టుకోండి అని అరుస్తాడు. అది చూసి వాళ్ల కొడుకు వచ్చి తనను తీసుకెళ్తాడు.
ఒక సంవత్సరం తరువాత స్టేషన్ మాస్టర్ అమరవీరుల స్తూపాన్ని చూస్తుంటాడు. హిమాది రియాజ్ పేరు చూసి బాధపడుతుంటాడు. తరువాత అందరు ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్తుంటారు. అక్కడే గబ్బర్ వచ్చి వెయిట్ చేస్తుంటాడు. నువ్వు బతికే ఉన్నావా అని మాస్టర్ అంటే నేను ఓకే కాని మీరు ఎలా బతికారు అని మాట్లాడుకుంటారు. నేను చనిపోయాను అనుకొని నా జేబులోంచి ఎవరో కీస్ తీసుకున్నారు అని ఎస్ఎమ్ అంటారు. అతనికి ఒక రూపాయి నోటి తీసి ఇది మీదే అని గబ్బర్ ఇస్తాడు. టీ తాగుదామనుకుంటారు. అంతలో ట్రైన్ సౌండ్ రావడంతో గబ్బర్ నేను వెళ్తున్న అని చెబుతాడు. ఈ సారి ట్రైన్ లో ఎవరిని దోచుకుకు అంటాడు మాస్టర్.. ఇద్దరు నవ్వుకుంటారు. భోపాల్ దుర్ఘటన కారణంగా దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ దుర్ఘటన అని టైటిల్స్ పడుతుంటాయి.