Eagle Trailer: మాస్ మహారాజా రవితేజ(Raviteja), దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని(Karthik Gattamneni ) కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన తాజా చిత్రం ఈగల్. ఈ సంక్రాంతి బరిలో విడుదలకు సిద్దం అయిన ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా ట్రైలర్ విడుదల అయింది. ఊర మాస్ యాక్షన్ సీన్స్‌తో రవితేజ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ట్రైలర్ ఉంది. “విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపల అవుతాను, విధ్వంసం నేను, విధ్వంసం ఆపే వినాశనం నేను” అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది. ఇంతకి హీరో ఎవరు, అతని గతం ఏంటి, గతంలో ఆయన చేసిన మారణకాండ ఏంటన్నది సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. “ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు” అనే మరో డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జనవరి 13న విడుదల అవుతున్న ఈ సినిమాపై ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.