»The Polling In Those Constituencies Will End An Hour Earlier Because
Telangana : ఆ నియోజకవర్గాల్లో గంట ముందే ముగియనున్న పోలింగ్ .. ఎందుకంటే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్యక నియోజకవర్గల్లో గంట ముందే పోలింగ్ ముగియనుందని ఎన్నికల కమీషన్ పేర్కొంది.13 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ (EC) తెలిపింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి,మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి,ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట,భద్రాచలం (Bhadrachalam)లో గంట పోలింగ్ ముందే ముగియనుంది. రాష్ట్రంలోని మిగతా 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. నవంబర్ 30వ తేదీన జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల నిర్వహణపై ఈసీఐ రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు, నగదు సీజ్‌పై ఈసీ ఆరా తీయగా ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్ (CEO Vikas Raj) ఈసీఐకి వివరాలు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అధికారులకు ఈసీఐ పలు సూచనలు చేసింది. తెలంగాణ ఎన్నికలు (Elections) నవంబర్ 30వ తేదీన జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 10 వరకూ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకూ గడువుంటుంది. నవంబర్ 13న నామినేషన్ల (Nominations) పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన మొత్తం ఐదు రాష్ట్రాల కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్లమంది ఓటర్లు (Voters) నమోదయ్యారు. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ప్రతి 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.